రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 92 మంది సైనికులు మృతి

ఆఫ్రికాలో మళ్లీ బోకోహరం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దేశంలోని చాద్‌ ప్రాంతంలో.. ఆదివారం లాక్‌ ప్రావిన్స్‌లోని బోమా గ్రామంలోకి ఎంటర్ అయిన ఉగ్రోవాదులు సైన్యంపైకి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 92 మంది సైనికుల ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది నెలలుగా అక్కడ తరచూ ఉగ్రవాదులు సైన్యంపై దాడికి పాల్పడుతున్నారు.తమ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో సైనికులు ప్రాణాలు కోల్పోయింది ఇదే తొలిసారి అని.. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలా జరగలేదని.. చాద్‌ అధ్యక్షుడు ఇడ్రిస్‌ డెబి […]

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 92 మంది సైనికులు మృతి
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2020 | 12:49 PM

ఆఫ్రికాలో మళ్లీ బోకోహరం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దేశంలోని చాద్‌ ప్రాంతంలో.. ఆదివారం లాక్‌ ప్రావిన్స్‌లోని బోమా గ్రామంలోకి ఎంటర్ అయిన ఉగ్రోవాదులు సైన్యంపైకి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 92 మంది సైనికుల ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది నెలలుగా అక్కడ తరచూ ఉగ్రవాదులు సైన్యంపై దాడికి పాల్పడుతున్నారు.తమ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో సైనికులు ప్రాణాలు కోల్పోయింది ఇదే తొలిసారి అని.. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలా జరగలేదని.. చాద్‌ అధ్యక్షుడు ఇడ్రిస్‌ డెబి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సోమవారం రోజు.. ఉత్తర నైజీరియాలో కూడా బొకొహారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అక్కడ కూడా దాదాపు 50 మంది సైనికులను పొట్టనపెట్టుకున్నారు.