బిగ్ బ్రేకింగ్ : ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి  దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ అశ్వత్థామరెడ్డి  దీక్షకు దిగారు. కాగా బయటఉంటే..తమ దీక్షను సరిగ్గా జరగనివ్వరని… నిన్నటి నుంచి బీఎన్‌ రెడ్డి నగర్‌లోని తన నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉంటూ అశ్వత్థామ దీక్షను కొనసాగించారు. తన దీక్షను భగ్నం చేస్తే సూసైడ్ చేసుకుంటానని బెదిరించడంతో పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం వరకు […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:11 pm, Sun, 17 November 19
బిగ్ బ్రేకింగ్ : ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి  దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ అశ్వత్థామరెడ్డి  దీక్షకు దిగారు. కాగా బయటఉంటే..తమ దీక్షను సరిగ్గా జరగనివ్వరని… నిన్నటి నుంచి బీఎన్‌ రెడ్డి నగర్‌లోని తన నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉంటూ అశ్వత్థామ దీక్షను కొనసాగించారు. తన దీక్షను భగ్నం చేస్తే సూసైడ్ చేసుకుంటానని బెదిరించడంతో పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం వరకు తటపటాయించారు. కానీ అతడి ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో..ముందడుగు వేయక తప్పలేదు. కాగా దీక్ష భగ్నం చేస్తోన్న సమయంలో పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

నిన్నటి నుంచి ఇంట్లోనే దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డికి మద్దతుగా జేఏసీ నేతలు పలు చోట్ల దీక్షలకు దిగారు. బస్సు డిపోల దగ్గర కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఇక ఆర్టీసీ జేఏసీ కో కన్వినర్ రాజిరెడ్డి దీక్షను సైతం భగ్నం చేశారు పోలీసులు. ఇంటి డోర్ పగలగొట్టి మరీ ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా నేటితో ఆర్టీసీ కార్మికుల సమ్మె 44వ రోజుకు చేరింది. కాగా సమ్మె కార్యచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సడక్ బంద్ కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది.