AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీఎంసీ బ్యాంక్ ఫ్రాడ్ కేసు.. 9 మంది అరెస్ట్.. రంగంలో ఈడీ !

ముంబైలో రూ. 4,355 కోట్ల భారీ స్కామ్ కు తెర తీసిన పీఎంసీ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో 9 మంది అరెస్టయ్యారు. ఈ మోసానికి సంబంధించి బీజేపీ నేత సర్దార్ తారాసింగ్ కొడుకు రాజ్ నీత్ సింగ్ ను ఆర్ధిక నేరాల విచారణా విభాగం శనివారం అరెస్టు చేసింది. ఈ కేసు నమోదైన వెంటనే రాజ్ నీత్ సింగ్ బ్యాంక్ ఫ్రాడ్ గురించి ఎవరితోనో మాట్లాడుతున్న వీడియో వైరల్ అయింది. ఈ కేసులో మొత్తం 10 మంది […]

పీఎంసీ బ్యాంక్ ఫ్రాడ్ కేసు.. 9 మంది అరెస్ట్.. రంగంలో ఈడీ !
Anil kumar poka
| Edited By: |

Updated on: Nov 17, 2019 | 5:26 PM

Share

ముంబైలో రూ. 4,355 కోట్ల భారీ స్కామ్ కు తెర తీసిన పీఎంసీ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో 9 మంది అరెస్టయ్యారు. ఈ మోసానికి సంబంధించి బీజేపీ నేత సర్దార్ తారాసింగ్ కొడుకు రాజ్ నీత్ సింగ్ ను ఆర్ధిక నేరాల విచారణా విభాగం శనివారం అరెస్టు చేసింది. ఈ కేసు నమోదైన వెంటనే రాజ్ నీత్ సింగ్ బ్యాంక్ ఫ్రాడ్ గురించి ఎవరితోనో మాట్లాడుతున్న వీడియో వైరల్ అయింది. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులపై ఆర్ధిక నేరాల విచారణా విభాగం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. రియల్ ఎస్టేట్ గ్రూపు హెచ్‌డీ‌ఐ‌ఎల్ ప్రమోటర్లయిన రాకేష్ వాధ్వాన్, ఆయన కుమారుడు సారంగ్ వాధ్వాన్, ఈ బ్యాంకు మాజీ ఎండీ జాయ్ థామస్, మాజీ డైరెక్టర్ వర్యామ్ సింగ్, డైరెక్టర్లు సుర్జీత్ సింగ్ అరోరా, రంజిత్ సింగ్, ఆడిటర్లు జయేష్ సంఘానీ, కేతన్ లక్డావాలా, అనితా కిర్దత్ ఇదివరకే అరెస్టయ్యారు. వీరిలో ముగ్గురు ఆడిటర్లూ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు.

అరెస్టయిన ఈ అధికారులతో కుమ్మక్కై వాధ్వానాలు భారీ ఎత్తున రుణాలు తీసుకుని ఎగవేసిన సంగతి తెలిసిందే. అయితే తమ ఆస్తులను అమ్ముతామని, వాటిని వేలంలో వేసి రుణాలు తీరుస్తామని వారు పేర్కొన్నారు. కాగా-బ్యాంకు దాదాపు దివాలా తీసే స్థితికి చేరుకోవడంతో.. డిపాజిటర్లు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలని రిజర్వ్ బ్యాంకు మొదట పరిమితి విధించింది. అయితే ఆ తరువాత క్రమేపీ దీన్ని 50 వేలకు పెంచింది. హెచ్‌డీ‌ఐ‌ఎల్‌కు సంబంధించి స్వాధీనం చేసుకున్న ఆస్తులను విడుదల చేసేందుకు అనుమతించాలంటూ ఆర్ధిక నేరాల విచారణా విభాగం ఎస్‌ప్ల‌నేడ్ కోర్టుకు ‘ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ‘ సమర్పించింది.

దీంతో ఆ ఆస్తులను వేలం వేయగలుగుతామని పేర్కొంది. అలాగే వీటిని రిలీజ్ చేసి విక్రయించేందుకు ఈడీ కూడా ఈ విధమైన సర్టిఫికెట్‌ను స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కోర్టుకు సమర్పించే యోచనలో ఉంది. వాధ్వానాలకు చెందిన రెండు విమానాలను, ఒక అధునాతన బోటును, రోల్స్ రాయిస్ కారును, ఇతర ఆస్తులను గతంలోనే స్వాధీనం చేసుకున్నారు.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?