Puri Temple: పూరీ జగన్నాథాలయ గోడపై పగుళ్లు.. మురికి నీరు చేరుతోందని ఆందోళన.. మరమ్మతులకు ఏఎస్‌ఐ సహాయం

ఒడిశా పూరీ జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం జగన్నాథ దేవాలయంలోని శతాబ్దాల నాటి కట్టడం మేఘనాద్ పచేరి గోడలపై పగుళ్లు కనిపిస్తున్నాయి. ఈ గోడల పగుళ్ల నుంచి మురికి నీరు కారుతోంది. దీంతో ఆలయ సేవకులు ఆందోళన చేశారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం ఏఎస్‌ఐ సహాయం కోరింది.

Puri Temple: పూరీ జగన్నాథాలయ గోడపై పగుళ్లు.. మురికి నీరు చేరుతోందని ఆందోళన.. మరమ్మతులకు ఏఎస్‌ఐ సహాయం
Puri Jagannath Temple
Follow us
Surya Kala

|

Updated on: Nov 04, 2024 | 10:06 AM

ఒడిశాలోని పూరీలోని జగన్నాథ దేవాలయం సరిహద్దు గోడ అయిన మేఘనాద్ పచేరి గోడకు పగుళ్లు ఏర్పడ్డాయి. శతాబ్దాల నాటి కట్టడంపై పగుళ్లు ఏర్పడిన తర్వాత ఆలయంలో పగుళ్లపై ప్రభుత్వం ఆరా తీసింది. ఈ పగుళ్ళ మరమత్తు కోసం భారత పురావస్తు శాఖ సహాయాన్ని కోరింది. ఆలయంలో పగుళ్లు రావడంతో సేవకులు ఆందోళనకు దిగారు. ఆలయ గోడల నుంచి మురికి నీరు కారుతోంది. ఈ మురికి నీరు ఆనందబజార్ నుంచి రైసర్ లోపలకు వస్తోంది.

మురికి నీరు లీక్ కావడంతో ఆలయ గోడలోని కొన్ని చోట్ల నాచు పేరుకుని మచ్చలు కనిపిస్తున్నాయని సేవకులు తెలిపారు. SJTA అరబింద పాధి మాట్లాడుతూ.. మేఘనాద్ పచేరి కోసం తాను చాలా ఆందోళన చెందుతున్నానని చెప్పారు. ఇప్పటికే ఆలయ గోడతో సహా ఆలయాన్ని భారత పురావస్తు శాఖ తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీ సమయంలో SJTAకి చెందిన సాంకేతిక బృందం కూడా ఉంది. భారత పురావస్తు శాఖ ద్వారా ఆలయ మరమ్మతులు త్వరగా పూర్తి చేస్తారని తము ఆశిస్తున్నామని తెలిపారు.

ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది

ఇవి కూడా చదవండి

పూరీ జగన్నాథ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది. జగన్నాథ ఆలయానికి నాలుగు ద్వారాలు , రెండు పెద్ద గోడలు ఉన్నాయ. ఆ గోడలలో ఒకటి మేఘనాద ప్రాచీర గోడ. వాస్తవానికి జగన్నాథ ఆలయ పరిపాలన సంస్థ ఆలయ భద్రత విషయంలో చాలా శ్రద్ధ వహిస్తుంది. ఈ విషయంలో న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని మరమ్మతు పనులు త్వరగా ప్రారంభించాలని సూచించారు. తద్వారా ఎలాంటి సమస్య తలెత్తదని అన్నారు.

మాజీ BJD ప్రభుత్వం ఆలయ ప్రాంగణం చుట్టూ విధ్వంసం చేసింది. దీంతో ఆలయంలో పగుళ్లు ఏర్పడ్డాయి. గతంలో జరిగిన తప్పులను వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలి. ఆలయంలో మురికి నీరు కారుతోంది. గోడల పగుళ్ల మధ్య నుంచి మురికి నీరు రావడంతో గోడలపై నాచు కూడా రావడం మొదలైంది. అయితే ఈ పగుళ్లను ఏఎస్‌ఐ బృందం త్వరలో సరిచేయనుందని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!