Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..

తిరుమలలో కార్తీక మాసాన్ని పురస్కరిచుకుని, ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. కార్తీక మాసం నెల రోజులూ తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తుల రద్దీతో నిండిపోతాయి. ముఖ్యంగా ఈ నెలల్లోని ప్రత్యెక పర్వదినాల్లో ఆలయాల సందర్శనకు భక్తజనం పోతెట్టుతారు. ఈ నేపధ్యంలో నవంబర్ 5న నాగుల చవితి పండగ సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో ప్రత్యెక ఉత్సవాలను నిర్వహించనున్నారు. రేపు శ్రీవారు తన దేవేరులతో కలిసి పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
Pedda Sesha Vahana Seva
Follow us
Surya Kala

|

Updated on: Nov 04, 2024 | 8:28 AM

కార్తీక మాసం శుక్ల పక్ష శుద్ధ చవితి తిధిని నాగుల చవితి పండగగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి వేడుకను ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు పాము పుట్టలో పాలు పోస్తారు. తమని తమ సంతానాన్ని చల్లగా చూడమంటూ నాగదేవతను వేడుకుంటారు. ఈ నెల 5వ తేదీ మంగళవారంన‌ అంటే రేపు నాగుల చవితి పర్వదినం సందర్భంగా తిరుమలలో ఘనంగా వేడుకలను నిర్వహించనున్నారు. శ్రీ మలయప్పస్వామివారు ఉభ‌య‌ దేవేరుల‌తో క‌లిసి పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటలవరకు దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే స్వామివారి బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ప్రసాదించాడు.

శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. స్వామివారు, దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి తిరువీధులలో రేపు విహరించనున్నారు. నాగుల చవితి సందర్భంగా పేద శేష వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తూ అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేయనున్నాడు శ్రీవారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..