AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: భక్తులతో కిక్కిరిసి శ్రీగిరి మల్లన్న ఆలయం.. ముక్కంటీశుని దర్శనానికి 6 గంటల సమయం

శ్రీశైలం కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తజనం పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరించి మల్లన్న దర్శనానికి ఆలయానికి చేరుకుంటున్నారు. అంతేకాదు గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. కార్తీక మాసం సోమవారం కనుక భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి స్పర్శ దర్శనం నిలిపి వేసి కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతినిస్తున్నారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో వేలాదిమంది భక్తులు వేచియున్నారు. దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది.

Srisailam: భక్తులతో కిక్కిరిసి శ్రీగిరి మల్లన్న ఆలయం.. ముక్కంటీశుని దర్శనానికి 6 గంటల సమయం
Srisailam Temple
Surya Kala
|

Updated on: Nov 04, 2024 | 7:14 AM

Share

నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీక సోమవారం మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.

కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఇప్పటికే శని, ఆది, సోమవారాలలో స్పర్శ దర్శనం, సామూహిక, గర్భాలయా అభిషేకాలు మాసంతం వరకూ నిలుపుదల చేశారు. అలానే మంగళవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే రోజుకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ రోజు కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నేటి సాయంత్రం కార్తీక మొదటి సోమవారం పురష్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
జబర్దస్త్ లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్
జబర్దస్త్ లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథుడు
దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథుడు
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్