Char Dham Yatra: కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాల తలుపులు మూసివేత.. బద్రీనాథ్ ఎప్పటి వరకూ తెరచి ఉంటుందంటే
అన్నా చెల్లెళ్ళ పండగ రోజున కేదార్‌నాథ్, యమునోత్రి ద్వారాలు మూసివేయబడ్డాయి. చార్ ధామ్‌లలో ఒకటైన కేదార్‌నాథ్ తలుపులు భాయ్ దూజ్ సందర్భంగా నవంబర్ 3 ఉదయం శీతాకాలం కోసం మూసివేయబడ్డాయి. ఈ ఏడాది కేదార్‌నాధుడిని దర్శనానికి 16.5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. మళ్ళీ 6 నెలల తర్వాత ఆలయ తలుపులు తెరవనున్నారు. ఇక చార్ ధామ్ యాత్రలో ఒకటైన బద్రీనాథ్ ధామ్ తలుపులు ఎప్పుడు మూసుకుంటాయో తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాల తలుపులు ఆదివారం శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించి మూసివేశారు. శీతాకాలం సందర్భంగా భాయ్ దూజ్ పండగ రోజున వైదిక ఆచారాల మధ్య ఆలయ తలపులు మూసివేయబడ్డాయి. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో యాత్రికులు, ఆలయ కమిటీ, పరిపాలన అధికారులు పాల్గొన్నారు. ఇక నుంచి బాబా కేదార్ ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో శీతాకాలంలో 6 నెలల పాటు కేదారేశ్వరుడు పూజించబడతాడు. కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేసిన తర్వాత కేదార్‌నాథుడిని పంచముఖి ఉత్సవ డోలి యాత్రగా తరలించారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 11వ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ కేదార్‌నాథ్ ధామ్ తలుపులు నవంబర్ 3వ తేదీన పవిత్రమైన భయ్యా దూజ్ పండుగ సందర్భంగా ఉదయం 8:30 గంటలకు మూసివేయబడ్డాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఇండియన్ ఆర్మీ బ్యాండ్‌తో భక్తిశ్రద్ధలతో నృత్యాలు చేశారు. ఈ ఏడాది 16.5 లక్షల మంది భక్తులు బాబా కేదార్‌నాథుడి ఆస్థానంలో మొక్కులు చెల్లించుకున్నారు.
కేదార్‌నాథ పంచముఖి డోలి ఉత్సవం
కేదార్‌నాథ ఆలయాన్ని ఉదయం 8:30 గంటలకు, యమునోత్రి ఆలయాన్ని మధ్యాహ్నం 12:05 గంటలకు మూసివేసినట్లు ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. రెండు ధామ్‌ల తలుపులు మూసివేసిన తర్వాత.. కేదార్‌నాథ్‌లోని శివుని విగ్రహాలు, యమునోత్రి అధిష్టానం దేవత యమునా దేవిని పల్లకీలలో వారి శీతాకాల నివాసాలైన ఉఖిమత్, ఖర్సాలీలకు పంపారు. కేదార్‌నాథ ధామ్ తలుపుల మూసివేత కార్యక్రమాన్ని చూసేందుకు 18,000 మందికి పైగా యాత్రికులు కేదార్‌నాథ ధామ్ చేరుకున్నారు.
కేదార్‌నాథుడిని దర్శించుకున్న 16 లక్షల మంది భక్తులు
బద్రీనాథుడు, కేదారనాథుడు ఆలయ కమిటీ (బికెటిసి) మీడియా ఇన్‌చార్జి హరీష్ గౌర్ మాట్లాడుతూ ఆలయ తలుపులు మూసివేయడానికి ముందు తెల్లవారుజామున 4 గంటలకు పెద్ద వేడుకను నిర్వహించినట్లు చెప్పారు. బికెటిసి ప్రెసిడెంట్ అజేంద్ర అజయ్ మాట్లాడుతూ చార్ ధామ్ యాత్ర సీజన్‌లో 16.5 లక్షల మందికి పైగా యాత్రికులు కేదారనాథుడిని దర్శించుకుని పూజలను నిర్వహించినట్లు చెప్పారు.
గర్హ్వాల్ హిమాలయాలలో 11,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కేదారనాథుడు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది యాత్రికులు దర్శించుకునే ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. చలికాలంలో హిమపాతం కారణంగా ఆలయాన్ని ఆరు నెలల పాటు మూసివేస్తారు.
బద్రీనాథుడి తలుపులు ఎప్పుడు మూసివేస్తారంటే
అదే సమయంలో అభిజీత్ ముహూర్త సమయంలో నవంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12:05 గంటలకు యమునోత్రి ధామ్‌ను మూసివేసినట్లు ఆలయ కమిటీ అధికారి ఒకరు తెలిపారు. గోవర్ధన్ పూజ రోజున నవంబర్ 2న చార్ ధామ్ ఆలయంలోని గంగోత్రిని మూసివేశారు. ఇది కాకుండా, ఈ ఏడాది నవంబర్ 17న శ్రీ బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేయనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..