Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: లష్కరే తోయిబా కమాండర్ ఉస్మాన్ హతంలో కుక్క బిస్కేట్లదే కీ రోల్.. ఎలా అంటే

జమ్ము కశ్మీర్లో తీవ్ర వాదుల ఏరివేత కార్యక్రమం జరుగుతోనే ఉంది. మన జవాన్లు, స్థానిక పోలీసులు కలిసి ఉగ్రవాదుల సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న తర్వాత శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో లష్కరే తోయిబా ఉగ్రవాది ఉస్మాన్ కాల్పులు ప్రారంభించాడు. అతని వద్ద ఏకే 47, గ్రెనేడ్లు ఉన్నాయి. పలు గ్రెనేడ్లను కూడా విసిరాడు. దీంతో ఓ భవనంలో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల మంటలు వ్యాపించకముందే భద్రతా బలగాలు మంటలను ఆర్పివేశాయి.

Jammu Kashmir: లష్కరే తోయిబా కమాండర్ ఉస్మాన్ హతంలో కుక్క బిస్కేట్లదే కీ రోల్.. ఎలా అంటే
Srinagar Khanyar Terror Attack
Follow us
Surya Kala

|

Updated on: Nov 04, 2024 | 9:44 AM

జమ్మూకశ్మీర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కమాండర్ ఉస్మాన్‌ను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో సైన్య ధైర్యసాహసాలతో పాటు, బిస్కెట్లు కూడా పెద్ద పాత్ర పోషించాయి. అవును శ్రీనగర్‌లో జరిగిన ఈ యాంటీ మిలిటెన్సీ ఆపరేషన్‌లో బిస్కెట్లు ప్రధాన పాత్ర పోషించాయి. సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్ల ద్వారా తుపాకీలతో పాటు, AI, ఇతర విషయాలు కూడా ఎన్‌కౌంటర్లలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయని నిరూపించబడింది. ఖన్యార్ ఎన్‌కౌంటర్‌లో బిస్కెట్ల కారణంగా సైన్యం చేపట్టిన మిషన్‌లో గొప్ప విజయం దక్కింది. లష్కరే తోయిబా కమాండర్ ఉస్మాన్‌ను జవాన్లు కాల్చిచంపారు.

రహస్య వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు, CRPF జవాన్లు శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో దాడి చేశారు. ఈ ప్రాంతం జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. భారీ ప్రాణనష్టం జరగకుండా ఆపరేషన్ ఎలా చేపట్టాలనే దానిపై భద్రతా బలగాలు తర్జనభర్జనలు పడ్డాయి. దీంతో తెల్లవారుజామున భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఓ అధికారి మాట్లాడుతూ, ఆపరేషన్ సమయంలో వీధి కుక్కల వియంలో జవాన్లు ఆందోళన చెందారు. ఎందుకంటే వీధిలో ఉన్న కుక్కలు సైనికులను చూసిన వెంటనే మొరుగడం ప్రారంభిస్తాయి. దీంతో ఉగ్రవాదులు అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు తప్పించుకోవచ్చు కూడా.. దీంతో తమని చూసి కుక్కలు అరవకుండా ఉండేదుకు భారత భద్రతా దళాలు కుక్కలకు బిస్కెట్లను ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. తమ వెంట బిస్కెట్ ప్యాకెట్లను తీసుకెళ్లారు. వీధి కుక్కలకు ఆ బిస్కెట్లను పెట్టి మొరగాకుండా బుజ్జగించారు. అప్పుడు సైనికులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.

జవాన్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో ఉస్మాన్ కాల్పులు ప్రారంభించాడు. అతని వద్ద ఏకే 47, గ్రెనేడ్లు ఉన్నాయి. పలు గ్రెనేడ్లను కూడా విసిరాడు. దీంతో ఓ భవనంలో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల మంటలు వ్యాపించకముందే భద్రతా బలగాలు మంటలను ఆర్పివేశాయి.

ఇవి కూడా చదవండి

కొన్ని గంటల పాటు జరిగిన పోరాటం తర్వాత జవాన్లు ఉస్మాన్‌ను హతమార్చారు. నలుగురు సైనికులు కూడా గాయపడ్డారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. గత 20 ఏళ్లుగా జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో ఉస్మాన్ ప్రధాన పాత్ర పోషించాడని అధికారులు తెలిపారు. దీంతో ఉస్మాన్ మరణాన్ని భద్రతా బలగాలు పెద్ద విజయంగా భావిస్తున్నాయి. ఈ విజయవంతమైన ఎన్కౌంటర్ లో బిస్కెట్లు కూడా ప్రముఖ పాత్రను పోషించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..