Canada: కెనడాలో హిందూ దేవాలయంపై మరోసారి దాడి.. భక్తులను కొట్టిన ఖలిస్తానీ తీవ్రవాదులు.. సంఘటనను ఖండించిన PM ట్రూడో

కెనడాలో హిందూ దేవాలయంపై మళ్లీ దాడి జరిగింది. ఖలిస్తాన్ తీవ్రవాదులు భక్తులను కొట్టారు. కాగా ఈ సంఘటనను ప్రధాని ట్రూడో ఖండించారు. అయితే ఇలా కెనడాలోని హిందూ దేవాలయాలపై దాడి చేయడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు చాలా జారిగాయి. ఆ దేశంలో పదే పదే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. దేవాలయాలను టార్గెట్ చేసుకుని.. కొన్నిసార్లు దేవాలయాల గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాస్తునే ఉన్నారు.

Canada: కెనడాలో హిందూ దేవాలయంపై మరోసారి దాడి.. భక్తులను కొట్టిన ఖలిస్తానీ తీవ్రవాదులు.. సంఘటనను ఖండించిన PM ట్రూడో
Khalistani Attack On Hindu Sabha Temple
Follow us

|

Updated on: Nov 04, 2024 | 10:58 AM

కెనడాలో హిందువుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఆ దేశంలో నివసిస్తున్న హిందువులపై నిరంతరాయంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజా బ్రాంప్టన్ లో మరోసారి హిందువులపై దాడులు జరిగాయి. ఇక్కడ ఖలిస్తానీలు బ్రాంప్టన్ హిందూ ఆలయంపై దాడి చేశారు. అక్కడ భక్తులను కొట్టారు. కాగా ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంలో జరిగిన హింసాత్మక ఘటనలు ఆమోదయోగ్యం కాదని అన్నారు.

కెనడాలో నివసిస్తున్న పౌరులందరూ తమ మత విశ్వాసాలను ఆచరించే స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు. హిందూ సమాజాన్ని రక్షించడానికి, ఈ సంఘటనపై తక్షణమే స్పందించి దర్యాప్తు ప్రారంభించిన పీల్ ప్రాంతీయ పోలీసులకు ప్రధాని ట్రూడో కృతజ్ఞతలు చెప్పారు. ఈ రోజు బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిరం వద్ద జరిగిన హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంపై ఖలిస్తానీ రాడికల్లు హఠాత్తుగా దాడి చేశారు. ఈ ఘటనపై విజయ్ జైన్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా కెనడాలోని పీల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఎక్కడ ఉన్నారని జైన్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఆలయంలోని హిందూ భక్తులపై ఖలిస్థానీ దాడులు చేస్తున్నారంటూ ఆ ట్వీట్‌లో కెనడా ప్రధానిని కూడా జైన్ ట్యాగ్ చేశారు. దీంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని శాంతింపజేశారు.

అదే సమయంలో నితిన్ చోప్రా అనే వ్యక్తి ఈ సంఘటనను ఖండించారు. కెనడాలో హింస, ద్వేషపూరిత చర్యలు ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. ఈరోజు కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంపై ఖలిస్తానీ హింసాత్మక రాడికల్స్ దాడి చేశారు. ఈ పరిస్థితి మరింత అదుపు తప్పకముందే.. పై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ హింసాకాండను సిక్కు, హిందూ సంఘాలు ఖండిస్తున్నాయని పేర్కొన్నారు.

ఖలిస్తానీలు రెడ్ లైన్ దాటారు : చంద్ర ఆర్య

అదే సమయంలో ఈ ఘటనపై నేపియన్ ఎంపీ చంద్ర ఆర్య స్పందిస్తూ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈరోజు ఖలిస్తానీ మద్దతుదారులు రెడ్ లైన్ దాటారని ఆయన అన్నారు. హిందూ సభా మందిరంలో హిందూ-కెనడియన్ భక్తులపై జరిగిన దాడితో కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం ఎంతగా తీవ్ర రూపం దాల్చిందో చూపిస్తుందని చెప్పారు. ఖలిస్తానీలు మన న్యాయ సంస్థల్లోకి పూర్తిగా చొరబడ్డారని అన్నారు. ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’ పేరుతో కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాదులకు స్వేచ్చ లభిస్తోందన్నారు. మన కమ్యూనిటీ భద్రత కోసం హిందూ-కెనడియన్లు ముందుకు వచ్చి తమ హక్కులను పొందాలని.. రాజకీయ నాయకులను బాధ్యులను చేయాలని తాను చాలా కాలంగా చెబుతున్నానని అన్నారు చంద్ర ఆర్య.

కెనడియన్ ఖలిస్తానీ తీవ్రవాదులు ఈరోజు తమ హద్దులను దాటారు. బ్రాంప్టన్‌లోని హిందూ సభా ఆలయ ప్రాంగణంలో హిందూ-కెనడియన్ భక్తులపై ఖలిస్తానీలు జరిపిన దాడి కెనడాలో ఖలిస్తానీ హింసాత్మక తీవ్రవాదం ఎంత లోతుగా మరియు ఇత్తడిగా మారిందో చూపిస్తుంది. నేను pic.twitter.com/vPDdk9oble అనుభూతి చెందడం ప్రారంభించాను

కెనడాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం.. అలయపై, భక్తులపై దాడి జరగడం ఇది మొదటిది కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. కెనడాలో మళ్లీ మళ్లీ హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేవాలయాలను టార్గెట్ చేసుకుని.. కొన్నిసార్లు దేవాలయాల గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాస్తున్నారు కూడా. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం తర్వాత.. ఖలిస్తాన్ మద్దతుదారులు కెనడాలో ఇటువంటి కార్యకలాపాలను పెంచారు. జూన్ 2023లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో నిజ్జర్ కాల్చి చంపబడ్డాడు.

ఈ ఏడాది జూలైలో ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. గత ఏడాది కూడా కెనడాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన అనేక కేసులు నమోదయ్యాయి. లక్ష్మీనారాయణ ఆలయాన్ని టార్గెట్ చేశారు. దాని గేటు, వెనుక గోడపై భారతదేశ వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల పోస్టర్లు అతికించారు. ఈ పోస్టర్ పై హర్దీప్ సింగ్ నిజ్జర్ చిత్రాన్ని కూడా ఉంచారు. సర్రేలోని లక్ష్మీ నారాయణ్ ఆలయం బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని పురాతన, అతిపెద్ద హిందూ దేవాలయం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..