AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyamani: ఆ హీరో పక్కన నటించాలన్న కోరిక ఇప్పటికి తీరిందంటున్న అందాల ప్రియమణి

తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు హీరోయిన్ ప్రియమణి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి...

Priyamani: ఆ హీరో పక్కన నటించాలన్న కోరిక ఇప్పటికి తీరిందంటున్న అందాల ప్రియమణి
Rajeev Rayala
|

Updated on: Jun 01, 2021 | 8:14 AM

Share

Priyamani:

తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు హీరోయిన్ ప్రియమణి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి.. ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువకావడంతో ఆమెకి ఇక్కడ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమె కన్నడ .. మలయాళ సినిమాలపై దృష్టిపెట్టి, అక్కడ బాగానే బిజీ అయింది.  కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ప్రియమణి.. ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ సెట్ చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ రెండు సినిమాలతో ప్రారంభించనుంది. ఆ సినిమాలు కూడా ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల సినిమాలు కావడం విశేషం. ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ప్రియమణి. అలాగే రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో కీలక పాత్రలో చేస్తుంది.

ఇటీవల ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ..” వెంకటేశ్ సరసన నటించాలనే కోరిక నాకు చాలాకాలం నుంచి ఉండేది. గతంలో ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏవో కారణాల వలన అది వర్కౌట్ కాలేదు.. ఇన్నాళ్లకు నా నిరీక్షణ ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిన పాత్రకి మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. ఇక ‘విరాటపర్వం’ సినిమాలోని భరతక్క పాత్రకి కూడా మంచి పేరు వస్తుంది” అంటూ  చెప్పుకొచ్చింది ప్రియమణి.

మరిన్ని ఇక్కడ చదవండి :

బిగ్‏బాస్‏లోకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ ?.. కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ చేస్తోన్న నిర్వాహకులు.. ఎవరెవరంటే..

అర్ధరాత్రి నా కారును నలుగురు దుండగులు వెంబడించారు.. అది చాలా భయంకరమైన రోజు.. చేదు అనుభవాన్ని చెప్పిన నటి..

Pranitha Wedding: రహస్యంగా పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..