AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‏బాస్‏లోకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ ?.. కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ చేస్తోన్న నిర్వాహకులు.. ఎవరెవరంటే..

Rhea Chakraborty: పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 15 తర్వలోనే ప్రారంభం కానుంది. ఈ షో కోసం నిర్వాహకులు ఇప్పటినుంచే

బిగ్‏బాస్‏లోకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ ?.. కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ చేస్తోన్న నిర్వాహకులు.. ఎవరెవరంటే..
Riya Chakravarthi
Rajitha Chanti
|

Updated on: May 31, 2021 | 9:46 PM

Share

Rhea Chakraborty: పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 15 తర్వలోనే ప్రారంభం కానుంది. ఈ షో కోసం నిర్వాహకులు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. దాదాపు ఇప్పటికే ఇందులో పాల్గోనే కంటెస్టెంట్స్ లీస్ట్ ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మరోసారి బాలీవుడ్ హీరో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటి బిగ్ బాస్ షో కు.. రియా చక్రవర్తికి సంబంధం ఏంటీ అనుకుంటున్నారా ?.. ఈ రియాల్టీ షోలో పాల్గోనే వారిలో రియా కూడా ఉందంటూ బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గోనేవారి జాబితాలో రియా పేరు కూడా ఉన్నట్లుగా సమాచారం.

గతేడాది.. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత రియా పేరు మీడియాలో తీవ్ర దుమారం రేపింది. మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో డ్రగ్స్ సరఫరా చేసిందని రియాను అరెస్ట్ చేశారు. దీంతో ఆమె కొన్ని నెలలపాటు జైల్లో గడిపింది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో రియా పేరు పలు చర్చలకు దారితీసింది. తాజాగా రియా మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం రియా చక్రవర్తి హిందీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 15లో పాల్గోననున్నట్లుగా తెలుస్తోంది. అయితే సుశాంత్ సింగ్ మరణం.. తన రిలేషన్ షిప్ గురించి ప్రజలకు తెలియజేయడానికి రియాకు ఇది మంచి అవకాశమని బీటౌన్ లోని ప్రముఖులు చెబుతున్నట్లుగా టాక్. రియాతోపాటు ఈ షోలో దయాబెన్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మాజీ తారక్ మెహతా కా ఓల్తా చాష్మా నటి దిశా వఖాని కూడా పాల్గోననున్నట్లుగా సమాచారం.

అలాగే కసౌటి జిందగీ కే 2 నటుడు పార్థ్ సమతాన్‏ను కూడా బిగ్ బాస్ సీజన్ 15 కోసం సంప్రదించారట. హస్యనటుడు కృష్ణ అభిషేక్, నాగిన్ సీజన్ 5 నటి సుర్భి చంద్నా కూడా ఉన్నట్లుగా సమాచారం. బిగ్ బాస్ సీజన్ 14 పోటీదారు రాహుల్ వైద్య, దిశా పర్మార్ కాబోయే భర్త కూడా సీజన్ 15 కోసం సంప్రదించినట్లుగా తెలుస్తోంది. జమై రాజా సీజన్ 2 నటి నియా శర్మ కూడా రియాలిటీ షోలో ఉండనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Also Read: అర్ధరాత్రి నా కారును నలుగురు దుండగులు వెంబడించారు.. అది చాలా భయంకరమైన రోజు.. చేదు అనుభవాన్ని చెప్పిన నటి..

Pranitha Wedding: రహస్యంగా పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..