అర్ధరాత్రి నా కారును నలుగురు దుండగులు వెంబడించారు.. అది చాలా భయంకరమైన రోజు.. చేదు అనుభవాన్ని చెప్పిన నటి..

పాపులర్ సీరియల్ దియా ఔర్ బాతి హమ్ నటి ప్రాచి తన జీవితంలో జరిగిన అతి భయాంకరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

అర్ధరాత్రి నా కారును నలుగురు దుండగులు వెంబడించారు.. అది చాలా భయంకరమైన రోజు.. చేదు అనుభవాన్ని చెప్పిన నటి..
Prachi 1
Follow us
Rajitha Chanti

|

Updated on: May 31, 2021 | 7:29 PM

Prachi Tehlan : పాపులర్ సీరియల్ ‘దియా ఔర్ బాతి హమ్’ నటి ప్రాచి తన జీవితంలో జరిగిన అతి భయాంకరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకరోజు తన భర్తతో కలిసి అర్ధరాత్రి కారులో ఇంటికి వెళ్తున్నప్పుడు నలుగురు దుండగులు వెంబడించారని చెప్పుకోచ్చారు. వాళ్లు అసభ్యంగా మాట్లాడుతూ.. తమను అనుసరించారని.. ఏకంగా తమ ఏరియా వరకు వచ్చేశారని పేర్కొంది. ఆ సమయంలో చాలా భయపడ్డామని.. వారి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయోనని బిక్కుబిక్కుమంటూ గడిపామని చెప్పారు. అనంతరం ఈ ఘటనపై తాను ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా పేర్కోన్నారు.

Prachi

Prachi

ఢిల్లీలో పుట్టి పెరిగిన ప్రాచీ .. ఓ జూమ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఢిల్లీలో ఎప్పుడూ తాము సురక్షితంగా లేమని చెప్పింది. ఫిబ్రవరిలో తాను ఈ చేదు ఘటనను ఎదుర్కోన్నట్లు ప్రాచీ తెలిపింది. ఆ కారులో కేవలం స్త్రీలు మాత్రమే లేరని.. తన భర్త కూడా ఉన్నాడని… అయిన కానీ ఆ దుండగులు వెంటబడ్డారు. సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేదని.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని.. అప్పుడే అమ్మాయిలకు రక్షణ ఉంటుందని ప్రాచీ అన్నారు. ఫ్యామిలీ పార్టీకి వెళ్లి తిరిగొచ్చే క్రమంలో అర్ధరాత్రి రెండు గంటలప్పుడు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని గుర్తు చేసుకుంది. తాగి తందానాలు ఆడుతూ, ఇతరులను ఇబ్బందులు పెట్టే వారిని వదలకూడదని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

Prachi Tehlan

Prachi Tehlan

ప్రాచీ మాజీ బాస్కెట్‌బాల్, నెట్‌బాల్ క్రీడాకారిణి. ఆ తర్వాత తాను డియా ఔర్ బాతి హమ్ సీరియల్ లో సహాయక పాత్రతో బుల్లి తెరలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇక్యావాన్ షోలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. 2019 లో మమ్ముట్టితో పాటు మలయాళ కాలం నాటి మమంగం లో ఆమె నటించింది.