పారిస్‌లో అంతుబట్టని భారీ శబ్దం.. అసలు కారణమిదే.!
పారిస్‌లో అంతుబట్టని భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీనితో ఒక్కసారిగా అందరూ అత్యవసర నెంబర్లకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు.
Paris Rattled By Sonic Boom: పారిస్‌లో అంతుబట్టని భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీనితో ఒక్కసారిగా అందరూ అత్యవసర నెంబర్లకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. బుధవారం మధ్యాహ్నం పారిస్, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో భారీ శబ్దం వినిపించింది. దీనితో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భారీ పేలుడు ఏమైనా సంభవించిందా.? లేక ఏదైనా భవనం కుప్పకూలిందా.? అనేది వాళ్లకు అర్ధం కాలేదు. అందరూ కూడా ఎమర్జెన్సీ నెంబర్లకు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఈ భారీ శబ్దంపై స్పందించిన ఫ్రెంచ్ పోలీసులు.. ట్విట్టర్ వేదికగా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Un bruit très important à été entendu à Paris et en région parisienne. Il n’y a pas d’explosion, il s’agit d’un avion de chasse qui a franchi le mur du son. N’encombrez pas les lignes de secours !
— Préfecture de Police (@prefpolice) September 30, 2020
‘పారిస్, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చాలా పెద్ద శబ్దం వినిపించింది. పేలుడు ఏమి కాదు, అది యుద్ధ విమానం నుంచి వెలువడిన సోనిక్ బూమ్ మాత్రమే’ అని పారిస్ పోలీసులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అత్యవసర ఫోన్ లైన్లకు కాల్ చేయడం నిష్క్రమించాలని ప్రజలను కోరారు.
Also Read:
మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!
ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..