ఐసీఎంఆర్ హెచ్చరిక.. భారత్‌లో మరో వైరస్ టెన్షన్.!

చైనాలో పురుడుపోసుకున్న మరో వైరస్ భారత్‌లో సోకే ప్రమాదముందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇప్పటికే డ్రాగన్ కంట్రీ, వియత్నాంలోని అనేకమందికి సోకిన ‘క్యాట్ క్యూ వైరస్'(CQV) భారత్‌లో మెనింజైటిస్, పీడియాట్రిక్ ఎన్సెఫలైటిస్ వంటి వ్యాధులకు కారణమవుతుందని తెలిపింది. (another virus from China) తాజాగా ఐసీఎంఆర్, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా సుమారు 883 హ్యూమన్ సీరం శాంపిల్స్ పరీక్షించగా.. కర్ణాటకకు చెందిన రెండు శాంపిల్స్‌లో ఈ వ్యాధి […]

  • Ravi Kiran
  • Publish Date - 11:33 am, Tue, 29 September 20

చైనాలో పురుడుపోసుకున్న మరో వైరస్ భారత్‌లో సోకే ప్రమాదముందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇప్పటికే డ్రాగన్ కంట్రీ, వియత్నాంలోని అనేకమందికి సోకిన ‘క్యాట్ క్యూ వైరస్'(CQV) భారత్‌లో మెనింజైటిస్, పీడియాట్రిక్ ఎన్సెఫలైటిస్ వంటి వ్యాధులకు కారణమవుతుందని తెలిపింది. (another virus from China)

తాజాగా ఐసీఎంఆర్, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా సుమారు 883 హ్యూమన్ సీరం శాంపిల్స్ పరీక్షించగా.. కర్ణాటకకు చెందిన రెండు శాంపిల్స్‌లో ఈ వ్యాధి తాలూకు యాంటీ బాడీస్ నిర్ధారణ అయ్యాయి. ఆయా సంబంధిత వ్యక్తుల్లో CQV యాంటీ బాడీస్ ఉన్నాయి గానీ వైరస్ లక్షణాలు లేనట్లు నిర్ధారించారు. దీనితో మరి కొంతమంది శాంపిల్స్ కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాధి పందులు, క్యూలెక్స్ దోమల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మలేరియా, డెంగీ, హంటా వ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్నారు. దీనితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read:

నాలుగేళ్ల డిగ్రీ చేసినవారికి పీహెచ్‌డీ అడ్మిషన్లు..

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. రూ. 35 వరకు పెరగనున్న టికెట్ ధర!