మరోసారి తగ్గిన బంగారం ధర.. అదే దారిలో వెండి

గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఒకానొక దశలో రికార్డు స్థాయి ధలు పలికిన బంగారం , వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

మరోసారి తగ్గిన బంగారం ధర.. అదే దారిలో వెండి
Follow us

|

Updated on: Sep 30, 2020 | 4:57 PM

గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఒకానొక దశలో రికార్డు స్థాయి ధలు పలికిన బంగారం , వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు క్షీణించడంతో దేశీయ మార్కెట్లలో ఈ ప్రభావం కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల పసిడి డిసెంబర్ ఫ్యూచర్స్ 0.5 శాతం క్షీణించి రూ.50,386 పలికింది. గత 3 సెషన్లలో పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రూ.50వేల దిగువకు వచ్చిన పసిడి ధరలు మూడు రోజుల్లో తిరిగి 50వేల మార్క్ దాటాయి. ఆగస్ట్ 7వ తేదీన హైలెవల్ రికార్డు స్థాయిలో రూ.56,200 పలికిన బంగారం ధర , ఆ తర్వాత క్రమంగా కిందికి దిగి వస్తుంది. ఈరోజు ప్రారంభ సెషన్‌లో ఎంసీఎక్స్‌లో పసిడి ధరలు రూ.50,400 దిగువకు వచ్చాయి.

పసిడికి పోటీ గా వెండి ధరల్లోనూ హెచ్చుతగ్గులు నెలకొన్నాయి. తాజాగా వెండి ధర స్వల్పంగా క్షీణించింది. కిలో వెండి రెండు శాతం క్షీణించి రూ.61,267కు దిగి వచ్చింది. అంతకుముందు సెషన్‌లో బంగారం రూ.500 పెరగగా, వెండి రూ.1,900 ఎగిసింది. కాగా, గత నెల గరిష్ట ధరతో ఇప్పటికీ రూ.5,500కు పైన తక్కువ పలుకుతున్నది. అటు, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భిన్నంగా నమోదు చేసుకున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.1 శాతం క్షీణించి 1,896.03 డాలర్లు పలికింది. వెండి ధర మాత్రం 0.2 శాతం పెరిగి 24.22 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.