కరోనా మరణాల్లో భారత్‌ది తప్పుడు లెక్కలు: ట్రంప్
కోవిడ్ మరణాల విషయంలో భారత్ తప్పుడు లెక్కలు చూపిస్తోందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో..
Donald Trump Comments: కోవిడ్ మరణాల విషయంలో భారత్ తప్పుడు లెక్కలు చూపిస్తోందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో రిపబ్లిక్ అభ్యర్ది, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్ధి జో బిడెన్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. భారత్, చైనా, రష్యా దేశాలు కరోనా మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయని.. వాస్తవాలను దాచిపెడుతున్నాయని ట్రంప్ అన్నారు.
చర్చలో భాగంగా మాట్లాడిన బిడెన్.. ”అమెరికాలో ఏడు మిలియన్ పైచిలుకు మందికి కరోనా వైరస్ సోకింది. అంతేకాదు 2 లక్షల మంది పైగా మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. అధ్యక్షుడిగా ట్రంప్‌కు ఈ విషయంలో ఎలాంటి ప్రణాళికలు లేవు. ఆయనకు ఫిబ్రవరిలోనే పరిస్థితి మరింత సీరియస్ అవుతుందని తెలుసు. ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రజలకు ఇవ్వాలని.. విపత్తు సమయంలో వారిని ఆదుకోవాలని నేను చెప్పాను. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. ట్రంప్ వైఖరి వల్ల ఎంతోమంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని బిడెన్ విరుచుకుపడ్డారు. ఇక ఆ వ్యాఖ్యలకు ట్రంప్ చురుగ్గా స్పందించారు.
”కోవిడ్ 19 పూర్తిగా చైనా తప్పిదం. మా ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలు తీసుకోవడం వల్లే దేశంలో కరోనా మరణాల సంఖ్య తక్కువగా నమోదైంది. ఇక గణాంకాల విషయానికి వస్తే.. చైనా, భారత్, రష్యాలో ఎంతమంది చనిపోయారో మీకు తెలియదు. ఆయా దేశాలు ఖచ్చితమైన లెక్కలను బహిర్గతం చెయ్యవు. కరోనా వ్యాక్సిన్‌కు కొద్ది వారాల దూరంలోనే మనం ఉన్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read:
మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!
ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..