రాహుల్ వ్యాఖ్యలపై సీతారామన్‌ కౌంటర్!

రాహుల్ వ్యాఖ్యలపై సీతారామన్‌ కౌంటర్!

కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు బదిలీ చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ఆ నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంగళవారం వెల్లడించారు. ‘ఆ నిధుల వినియోగంపై ఇప్పుడే ఏమీ చెప్పలేను. వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరవాత వివరిస్తాం’ అని పుణెలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. దీనిపై […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 28, 2019 | 12:37 AM

కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు బదిలీ చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ఆ నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంగళవారం వెల్లడించారు. ‘ఆ నిధుల వినియోగంపై ఇప్పుడే ఏమీ చెప్పలేను. వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరవాత వివరిస్తాం’ అని పుణెలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు.

దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ నుంచి ప్రభుత్వం పెద్దమొత్తంలో డబ్బులు దొంగలించిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఈ విమర్శలను సీతారామన్‌ తిప్పికొట్టారు. ‘రాహుల్ గాంధీ దోపిడీ అంటున్నారు. నేను ఆ పదాన్ని వాడను. కాంగ్రెస్‌ చోర్‌(దొంగ) అనే ట్యాగ్ వద్దే ఆగిపోయింది. ఆ పదాన్ని వాడటంలో వారు నిపుణులు. కానీ ఆర్‌బీఐ ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దని నేను కాంగ్రెస్‌ను కోరుతున్నాను. ఆర్‌బీఐ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీని  కాంగ్రెస్ ప్రశ్నించడం బాధిస్తోంది. రాహుల్‌ గాంధీ చోర్‌, చోరి వంటి పదాలు వాడినప్పుడు నాకో విషయం గుర్తుకు వస్తుంది. ఆయన ఆ పదాలను బాగానే వాడినప్పటికీ ప్రజలు మాత్రం గట్టి సమాధానం ఇచ్చారు. మళ్లీ ఎందుకు ఆ పదాలనే వాడుతారు?’ అని ఆమె విరుచుకుపడ్డారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu