అనుమానం పెనుభూతం… ప్రియుడే కాలయముడు!

ప్రేమించిన యువతి మరోకరితో మాట్లాడుతుందనే అనుమానం ఆమె పాలిట శాపంగా మారింది. చివరకు ఆమె ప్రాణాలనే తీసిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన కావిటి తేజస్విని డిప్లొమో చదువుతున్న సమయంలో సత్తుపల్లికి చెందిన నితిన్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో కొంత కాలం గడిచిన తర్వాత ఆ యువతిపై అనుమానం పెరిగింది. తన ప్రియురాలు […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:57 am, Wed, 28 August 19
అనుమానం పెనుభూతం... ప్రియుడే కాలయముడు!

ప్రేమించిన యువతి మరోకరితో మాట్లాడుతుందనే అనుమానం ఆమె పాలిట శాపంగా మారింది. చివరకు ఆమె ప్రాణాలనే తీసిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన కావిటి తేజస్విని డిప్లొమో చదువుతున్న సమయంలో సత్తుపల్లికి చెందిన నితిన్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో కొంత కాలం గడిచిన తర్వాత ఆ యువతిపై అనుమానం పెరిగింది. తన ప్రియురాలు తనతో కాకుండా మరొకరితో మాట్లాడుతుందనే అనుమానంతో ఆమెను హతమార్చాలని పథకం వేసుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆదివారం రాత్రి ఆమెకు మాయమాటలు చెప్పి ద్విచక్రవాహనంపై కొత్త లంకపల్లి గుట్టల వద్దకు తీసుకెళ్లి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఖర్చీఫ్‌తో గొంతు నులిమి హత్యచేసి శవాన్ని అక్కడ పడేసి.. ఏమీ తెలియనట్లు ఖమ్మంలో తను ఉండే హాస్టల్‌కి చేరుకున్నాడు. కాగా సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు తన కుమార్తె కనిపించడం లేదంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొత్త లంకపల్లి వద్ద తేజస్విని మృతిచెందినట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కల్లూరు ఏసీపీ వెంకటేష్‌ తెలిపారు.