Monkeys Terror: పంట పొలాలపై వానర సేనల దండయాత్ర.. కిష్కిందకాండను అడ్డుకునేందుకు రైతుల వినూత్న ప్రయోగం
కోతులు అడవులకు వాపస్ పోవడం కాదు.. రోజురోజుకూ ఊర్లు, పొలాల మీదకు దాడులు పెంచుతున్నాయి. కూరగాయలు, పండ్లతోటలతో పాటు ఆహార పంటలు ఏవి కన్పించినా దక్కనివ్వలేదు.
Monkeys Terrorise Villages in Telangana: కోతులు అడవులకు వాపస్ పోవడం కాదు.. రోజురోజుకూ ఊర్లు, పొలాల మీదకు దాడులు పెంచుతున్నాయి. కూరగాయలు, పండ్లతోటలతో పాటు ఆహార పంటలు ఏవి కన్పించినా దక్కనివ్వలేదు. దీంతో ఆహార పంటలు సాగుచేసే రైతులకు కోతుల బెడద పెద్ద సమస్యగా మారింది. పల్లెలు, మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలనే తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో కోతుల తాకిడికి తట్టుకోలేక పంటలు వేయడం లేదు. కొన్ని ఊర్లలో పెరటి తోటలు, ఇళ్లలో కూరగాయలు పండించుకోవడం కూడా కష్టంగా మారింది. కోతులు చిరు ధాన్యాలు, కూరగాయల పంటల్లో దేనినీ వదలడం లేదు. దీంతో వ్యవసాయం చేయడమే కష్టమైపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడవులు నశించిపోవడంతో అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన కోతులు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చేరుకుని కిష్కింద కాండ సృష్టిస్తున్నాయి.. రైతులు ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంటలు నష్టం చేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మంకీ ఫుడ్ కోర్ట్ లేకపోవడంతో ఆకలి కేకలు వేసుకుంటూ కోతులు పంట పొలాలు, గ్రామాల మీదకు దండయాత్ర చేస్తున్నాయి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు, భద్రాచలం, పినపాక, వైరా నియోజకవర్గాలలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కోతుల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు పలు రకాలుగా ఎలుగుబంటి, పులి, కొండముచ్చు, మంకీ గన్నులు వేషధారణలను వేస్తూ వాటిని అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా వైరా, ఇల్లందు నియోజక వర్గంలోని వైరా కొణిజర్ల తల్లాడ మండలాల్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.. రైతులు పంటలను కాపాడుకునేందుకు పంట పొలాల చుట్టూ చీరలు కంచెలు కట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో వేలాది కోతులు స్వైరవిహారం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు సాగుచేసిన పంటలు పత్తి, మొక్కజొన్న, పెసర, పంటలను నష్టపరుస్తున్నాయని తెలిపారు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు తెలిపినా ఫారెస్ట్ అధికారులు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ పట్టించుకోవటం లేదని, దీంతో పంటలు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని వాటిని అటవీ ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Read Also… Fish Biscuits: కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఫిష్ బిస్కెట్లు .! ( వీడియో )