ఇదేం పని..ఏపుగా పెరిగిన మిర్చి పంటను ధ్వంసం చేశారు, కన్నీరుమున్నీరవుతున్న రైతు
ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే, మరోపక్క చేతికి అందివచ్చిన....
ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే, మరోపక్క చేతికి అందివచ్చిన మిరప పంటను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ధ్వంసం చేశారు. దీంతో ఆ పేద రైతు దుఃఖం కట్టలు తెంచుకుంది. నేలపాలైన పంటను చూసి రైతు ఆందోళన చెందుతున్నాడు. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొర్లకుంట తండా గ్రామానికి చెందిన బానోతు సైదులు తన ఎకరం పొలంతో పాటు మరో 30 గుంటల భూమిని కౌలుకు తీసుకుని మిరప పంట సాగు చేస్తున్నాడు. మిర్చి పంట ఏపుగా పెరిగి చేతికి అందివచ్చిన పంటను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నారుకు పెట్టుబడి 50 వేల వరకు పెట్టామని, దిగుబడి కూడా బాగా వచ్చిన పంట ధ్వంసం కావడంతో రూ. 5 లక్షల వరకు ఆదాయం వస్తుందనుకున్న ఆశలు ఆవిరైపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆర్థికంగా చితికిపోయామని రైతు దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read :
అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్దీప్ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్
రైతులకు ఆదాయం పెంచే విధానాలపై ఫోకస్ పెట్టండి, బ్యాంకర్లకు సీఎం జగన్ సూచన