Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు ఆదాయం పెంచే విధానాలపై ఫోకస్ పెట్టండి, బ్యాంకర్లకు సీఎం జగన్ సూచన

కౌలు రైతులకు లోన్స్ విషయంలో బ్యాంకులు వ్యవహరిస్తోన్న తీరుపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకులు ఇస్తున్న రుణాలు అంత గొప్పగా లేవని పేర్కొన్నారు.

రైతులకు ఆదాయం పెంచే విధానాలపై ఫోకస్ పెట్టండి, బ్యాంకర్లకు సీఎం జగన్ సూచన
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 11, 2020 | 4:09 PM

కౌలు రైతులకు లోన్స్ విషయంలో బ్యాంకులు వ్యవహరిస్తోన్న తీరుపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకులు ఇస్తున్న రుణాలు అంత గొప్పగా లేవని పేర్కొన్నారు. కౌలు రైతులకు సహకారం అందించే విషయంలో బ్యాంకులు మరింత చిత్తశుద్దితో వ్యవహరించాలని కోరారు. శుక్రవారం తాడేపల్లిలోని  క్యాంపు ఆఫీసులో  నిర్వహించిన 213వ ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మంత్రులు కన్నబాబు, బొత్స, మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్‌ నీలం సాహ్నీ, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్‌ కె.నిఖిల సహా పలు బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ మీటింగ్‌లో అగ్రికల్చర్ లోన్స్‌పై ముందుగా చర్చించిన సీఎం… రైతుల ఆదాయం ఎలా రెట్టింపు అవుతుందన్న దానిపై బ్యాంకర్లు ఫోకస్ పెట్టాలని సూచించారు. జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్న జగన్.. వారి జీవితాలను మార్చడానికి బ్యాంకర్లు మరింత తోడ్పాటు అందించాలని కోరారు. విపత్తుల సమయంలో రైతులకు చేదోడుగా నిలవాలన్నారు. ఎంఎస్‌ఎంఈలకు అండగా నిలబడితేనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని సీఎం చెప్పారు. మహిళలను మరింత చైతన్యపరిచేలా బ్యాంకులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. 2014 నుంచి పరిశ్రమలకు రాయితీల బకాయిలను సుమారు 1100 కోట్ల రూపాయలు చెల్లించామని ముఖ్యమంత్రి వివరించారు.

Also Read :అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్