అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్దీప్ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై నేపథ్యంలో బెంగల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధనకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై నేపథ్యంలో బెంగల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధనకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై మమత చేసిన కామెంట్లకు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు. మమతా అగ్నితో ఆటలాడకూడదని ఘాటు కామెంట్స్ చేశారు.
నడ్డా కాన్వాయ్‌పై దాడి విషయంపై స్పందించిన మమతా..బీజేపీ ర్యాలీల్లో కార్యకర్తలు లేరని, ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే నడ్డా కాన్వాయ్‌పై దాడి చేయించారని ఆరోపించారు మమత. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ విధంగా ఎలా మాట్లాడతారని మండిపడ్డారు ధనకర్. రాష్ట్రంలో శాంతిభధ్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశానని వెల్లడించారు ధనకర్. చట్టాన్ని ఉల్లంఘించే వారికి బెంగాల్ పోలీసులు, యంత్రాంగం రక్షణ కల్పిస్తున్నాయని ఆరోపించారు.
Also Read : మూన్‌పైకి మనోడు… నాసా బృందంలో భారత సంతతికి చెందిన రాజా చారి …. ఆర్టిమిస్ కార్యక్రమంలో భాగం…