- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroines like sreeleela pooja hegde samantha trying to do the movie promotion like Rashmika Mandanna
Rashmika Mandanna: బెంచ్ మార్కును రీచ్ అయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న ముద్దుగుమ్మలు
రష్మిక సెట్ చేసిన బెంచ్ మార్కును రీచ్ అయ్యే పనుల్లో బిజీగా ఉన్నారు మన హీరోయిన్లు. ఆమెను బీట్ చేసి టాప్ పొజిషన్‌కి వస్తారా? లేకుంటే, రష్మికలాగా బాగా చేశారనిపించుకుంటారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదో ఇంట్రస్టింగ్ డిస్కషన్. రష్మిక చేసినట్టు ప్రమోషన్లు ఎవరూ చేయలేరు. రాత్రంతా షూటింగులు చేసి, పగలు ప్రమోషన్లకు హాజరవుతున్నారంటూ కో స్టార్స్ అందరూ కాంప్లిమెంట్ ఇచ్చేశారు నేషనల్ క్రష్‌కి.
Updated on: Apr 21, 2025 | 9:05 PM

రష్మిక చేసినట్టు ప్రమోషన్లు ఎవరూ చేయలేరు. రాత్రంతా షూటింగులు చేసి, పగలు ప్రమోషన్లకు హాజరవుతున్నారంటూ కో స్టార్స్ అందరూ కాంప్లిమెంట్ ఇచ్చేశారు నేషనల్ క్రష్‌కి. ఆమెను బీట్ చేసేలా, ఒకింత పోటాపోటీగా అమరన్ ప్రమోషన్లు చేశారు సాయిపల్లవి.

వాళ్లిద్దరికన్నా నేనేం తక్కువా? అన్నట్టు రాబిన్‌హుడ్ కోసం కష్టపడ్డారు శ్రీలీల. సినిమా క్లిక్ అయ్యి ఉంటే, శ్రీలీల కష్టానికి ఫలితం దక్కేది. కానీ, సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం కావడంతో కిస్సిక్ బ్యూటీ కామ్‌గా ఉండిపోయారు.

ఇప్పుడు లేటెస్ట్ గా పూజా హెగ్డే రెట్రో సినిమా కోసం గ్రౌండ్‌లోకి దిగి మరీ పబ్లిసిటీ చేస్తున్నారు. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్ కి దగ్గర కావడానికి అంతే ట్రై చేస్తున్నారు ఈ బ్యూటీ.

సొంత సినిమా శుభం కోసం సమంత కూడా బాగా కష్టపడుతున్నారు. ఓ వైపు తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకుంటూ, మరోవైపు కొత్తవారితో పోల్చి చూసుకుంటూ శుభం మూవీని ప్రమోట్ చేస్తున్నారు సామ్.

స్టేజ్ మీద సామ్ లవ్ సింబల్‌ని చూపించిన తీరు చూసిన వారందరూ రష్మికను మరోసారి గుర్తుచేసుకున్నారంటే.. ప్రమోషన్ల పరంగా నేషనల్ క్రష్ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అర్థం చేసుకోవచ్చు.




