Upcoming Movies: సమ్మర్ స్పెషల్.. అన్లిమిటేడ్ ఎంటర్టైన్మెంట్ వచ్చినట్లే.. ఈ వారం ఓటీటీ/థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
విద్యార్థులకు ఎగ్జా్మ్స్ కంప్లీట్ అయ్యాయి. దీంతో సమ్మర్ హాలీడేస్ మరింత వినోదాన్ని పంచేందుకు సరికొత్త చిత్రాలను తీసుకువస్తున్నారు మేకర్స్. వేసవి వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం థియేటర్లతోపాటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి సినీప్రియులను ఆకట్టుకునేందుకు మరిన్ని మూవీస్ రాబోతున్నాయి.

వేసవి వినోదాల విందును పంచడానికి ఈ వారం సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ విడుదలయ్యేందుకు రెడీ అయ్యాయి. ఇటు థియేటర్లు.. అటు ఓటీటీల్లో కొత్త జానర్ చిత్రాలు సందడి చేయబోతున్నాయి. అయితే భారీ బడ్జెట్, స్టార్ హీరోస్ సినిమాలు లేకపోవడంతో.. ఇప్పుడు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం చౌర్య పాఠం, సారంగపాణి జాతకం, జింఖానా చిత్రాలు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరీ ఈ వారం వచ్చే చిత్రాలు, వెబ్ సిరీస్ ఏంటో చూసేద్దామా.
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు.. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న సినిమా సారంగపాణి జాతకం. ఈ మూవీ ఏప్రిల్ 25న అడియన్స్ ముందుకు రానుంది. అలాగే ఇంద్రరామ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా చౌర్య పాఠం. ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది. వీటితో పాటు ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు నస్లేన్ కె. గఫూర్ నటించిన జింఖానా సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.
ఈవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు.. నెట్ ఫ్లిక్స్..
- ఏ ట్రాజడీ ఫోర్‌టోల్డ్ ఫ్లైట్ 3054 .. ఇంగ్లీష్.. ఏప్రిల్ 23
- వీక్ హీరో.. ఇంగ్లీష్.. ఏప్రిల్ 25
- డిటెక్టివ్ కోనాన్ .. యానిమేషన్.. ఏప్రిల్ 25
- బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్.. ఇంగ్లీష్.. ఏప్రిల్ 23
- యు: ది కిల్లర్ ఫైనల్.. ఏప్రిల్ 24
- హ్యావోక్.. ఇంగ్లీష్.. ఏప్రిల్ 25
- జ్యువెల్ థీఫ్.. ది హెయిస్ట్ బిగెన్స్.. హిందీ.. ఏప్రిల్ 25
జీ 5..
అయ్యన మానే.. ఏప్రిల్ 25
సోనీలివ్..
షిర్టీ వాలే సాయిబాబా.. ఏప్రిల్ 21
జియో హాట్ స్టార్..
- ఎల్2: ఎంపురాన్.. తెలుగు.. ఏప్రిల్ 24
- ది రిహార్సల్స్ సీజన్ 1.. ఏప్రిల్ 21
- స్టార్ వార్స్.. యాండిర్.. ఏప్రిల్ 23
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..




