టీవీ9 ఎఫెక్ట్: నకిలీ డాక్టర్ల పై కథనాలకు స్పందించిన పోలీసులు, అదుపులోకి పలువురు. క్లీనిక్ లు మూసి పారిపోయిన మరికొందరు
సరైన విద్యార్హతలు లేకుండా ఆస్పత్రులు, క్లీనిక్ లు పెట్టేసి.. ప్రజలకు వైద్యం చేసేస్తోన్న నకిలీ డాక్టర్లపై టీవీ9 నిఘా టీం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది..
సరైన విద్యార్హతలు లేకుండా ఆస్పత్రులు, క్లీనిక్ లు పెట్టేసి.. ప్రజలకు వైద్యం చేసేస్తోన్న నకిలీ డాక్టర్లపై టీవీ9 నిఘా టీం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. తప్పుడు సర్టిఫికేట్లతో హైదరాబాద్ లో విచ్చలవిడిగా వైద్యం చేసేస్తోన్న డాక్టర్ల నిగ్గుతేల్చింది. ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో సైబారాబాద్ పోలీసులు స్పందించారు. నానక్ రామ్ గూడా , గౌలి దొడ్డి , రాయదుర్గం లో ని ప్రైవేట్ క్లినిక్ లపై SOT పోలీస్ లు దాడులు చేశారు. ఏం క్లినిక్ , మథర్ క్లినిక్ , కాకతీయ క్లినిక్ లలో మాదాపూర్ sot పోలీసులు సోదాలు నిర్వహించారు. పలువురు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఉండగా, టీవీ9 వరుస కథనాలతో అర్హత లేని కొంతమంది డాక్టర్లు తమ క్లీనిక్ లు మూసి పారిపోగా, TV9 ఆపరేషన్ లో పట్టుబడ్డ నకిలీ డాక్టర్లు దాదాపు వంద మందికి పైనే ఉన్నారు.