బుమ్రా కొట్టిన షాట్​కు గ్రౌండ్‌లో కుప్పకూలిన ఆసీస్ బౌలర్​, నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న సిరాజ్ పరిగెత్తుకు వెళ్లి..

ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతోన్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ ఆకట్టుకోలేకపోయిన.. పేసర్​ జస్‌ప్రీత్‌ బుమ్రా  హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.

బుమ్రా కొట్టిన షాట్​కు గ్రౌండ్‌లో కుప్పకూలిన ఆసీస్ బౌలర్​, నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న సిరాజ్ పరిగెత్తుకు వెళ్లి..
Follow us

|

Updated on: Dec 11, 2020 | 5:48 PM

ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతోన్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ ఆకట్టుకోలేకపోయిన.. పేసర్​ జస్‌ప్రీత్‌ బుమ్రా  హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.  బుమ్రా.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి బలంగా వెళ్లి గ్రీన్‌ తలకు తాకింది. నొప్పితో విలవిల్లాడిన గ్రీన్‌ అక్కడ కూలబడిపోయాడు. ఈ క్రమంలో బుమ్రా పరుగు చేసేందుకు ప్రయత్నించగా… నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న మహ్మద్‌ సిరాజ్ తన బ్యాట్‌ను పడేసి వెంటనే అతడి వద్దకు పరిగెత్తాడు. అంపైర్ కూడా అలెర్టై పరిస్థితి సమీక్షించేందుకు‌  ఫిజియోను రప్పించడంతో కాసేపు ఆందోళన నెలకుంది. అయితే లక్కీగా గ్రీన్‌కు పెద్ద గాయం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఈ గాయం తర్వాత కామెరూన్​ గ్రీన్​ ప్లేసులో పాట్​ రో కంకషన్ సబ్​స్టిట్యూట్​గా ​ ఆస్ట్రేలియా టీమ్ బరిలో దించింది. గ్రీన్​ ప్రస్తుతం డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నాడని.. శనివారం అతని ఆరోగ్య పరిస్థితిపై అప్​డేట్​ ఇస్తామని క్రికెట్​ ఆస్ట్రేలియా తెలిపింది.

Also Read :

అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్

రైతులకు ఆదాయం పెంచే విధానాలపై ఫోకస్ పెట్టండి, బ్యాంకర్లకు సీఎం జగన్ సూచన