China Apps: చైనా యాప్స్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో సరికొత్త ట్విస్ట్.. కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు..

చైనాకు చెందిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక నిందితుడైన నైసర్ కొఠారిని ఈడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

China Apps: చైనా యాప్స్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో సరికొత్త ట్విస్ట్.. కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు..
Follow us

|

Updated on: Dec 11, 2020 | 7:56 PM

చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక నిందితుడైన నైసర్ కొఠారిని ఈడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో నైసర్ కొఠారీని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. కాగా, అంతకు ముందు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, చైనాకు చెందిన లిన్ యాంగ్ హు లను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఇదిలాఉంటే, కొన్ని నెలల క్రితమే చైనా యాప్స్ వ్యవహారాలను హైదరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. చైనాకు చెందిన ఓ కంపెనీ ఇండియాలో ఈ కామర్స్ పేరుతో వందలాది బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చైనా కంపెనీలు మన దేశ ఖజానాను కొల్లగొట్టారని, దాదాపు రూ.1100 కోట్లను మనీలాండరింగ్ ద్వారా చైనాకు తరలించినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో నమోదైన ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

కాగా, గతంలో హైదరాబాద్‌లో నమోదైన ఈ కేసు ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు.. దేశ వ్యాప్తంగా ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, పుణె సహా పలు చోట్ల సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంగా నాలుగు హెచ్ఎస్‌బిసి బ్యాంకు ఖాతాల్లో కొంత సొమ్మును ఈడీ సీజ్ చేసింది. అంతేకాదు.. ఈ దాడుల్లో భాగంగా 17 హార్డ్ డిస్క్‌లను, 5 ల్యాప్‌ట్యాప్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని చార్టడ్ అకౌంటెట్ల సహకారంతో చైనీయులు భారత్‌లో కంపెనీలు సృష్టించినట్లు ఈడీ గుర్తించింది. వీటిలో మొబైల్ వాలెట్లతోనే ఎక్కువ లావాదేవీలు జరిగినట్లు అధికారులు ధృవీకరించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!