గుండు బాస్‌కు లోకల్ బొక్క… చోరీ చేసింది వీరే..!!!
లలితా జ్యూయలర్స్ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. ఇప్పటికే నిందుతులను ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తూ వారి దగ్గర నుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. కాగా ఇటీవలే క్రైమ్‌కి ప్రధాన సూత్రధారుడిగా భావిస్తున్న మురగన్ బెంగుళూరు సివిల్ కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే. తన మేనల్లుడు సురేశ్ సరెండర్ అయ్యి..కీలక సమాచారం వెల్లడించడింతో సూత్రధారి లొంగిపోక తప్పలేదు. ఇక అతడు ఇచ్చిన సమాచారం నేపథ్యంలో..నిన్న మధురైకి చెందిన సి. గణేశన్ వ్యక్తిని […]

లలితా జ్యూయలర్స్ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. ఇప్పటికే నిందుతులను ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తూ వారి దగ్గర నుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. కాగా ఇటీవలే క్రైమ్‌కి ప్రధాన సూత్రధారుడిగా భావిస్తున్న మురగన్ బెంగుళూరు సివిల్ కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే. తన మేనల్లుడు సురేశ్ సరెండర్ అయ్యి..కీలక సమాచారం వెల్లడించడింతో సూత్రధారి లొంగిపోక తప్పలేదు. ఇక అతడు ఇచ్చిన సమాచారం నేపథ్యంలో..నిన్న మధురైకి చెందిన సి. గణేశన్ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి 6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా మురగన్ తాను బంగారం దాచిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించాడు. ఆ ప్లేసుకు మురగన్‌ను వెంటబెట్టుకెళ్లిన కాఖీలు అతడి ద్వారానే బ్యాగ్‌ను ఓపెన్ చేయించారు. కాగా ఓ నిర్మానుష్య ప్రదేశంలో గుంట తీసి అందులో బంగారం నింపిన బ్యాగును దాచిపెట్టాడు మురగన్. మురగన్‌పై గతంలో పలు బ్యాంకు రోబరీలు, దొంగతనాల ఆరోపణలు ఉన్నాయి.
ఈ నెల 2వ తేదీ రాత్రి లలిత జ్యూయలరీ దుకాణంలో మురుగన్ బ్యాచ్ బంగారు ఆభరణాలను దోచుకొన్నారు. ఈ దుకాణం వెనుక వైపు గోడను తవ్వి దొంగలు లోపలికి వ్రవేశించారు. దుకాణంలో ఉన్న రూ. 13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకొన్నారు. ఈ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.