జేసీబీతో వచ్చి..ఏటీఎంను కొల్లగొట్టారు..!

జేసీబీతో వచ్చి..ఏటీఎంను కొల్లగొట్టారు..!

మాములుగా దొంగలు ఫాస్ట్‌గా మూవ్ అయ్యే వెహికల్స్‌లో వచ్చి తమ పని కానిచ్చేసి వెళ్లిపోతూ ఉంటారు.  కానీ ఇప్పుడు వారు కూడా కొత్త పంథాలను ఎన్నుకుంటారు. కాస్త ఇన్నోవేటీవ్‌గా ఆలోచిస్తూ..ఇంటిలిజెంట్ థీవ్స్ అనిపించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఐర్లాండ్‌లో జరిగిన ఓ ఏటీఎం చోరీ  అందర్నీ ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే అక్కడ ఏటీఎం చోరీకి వచ్చిన వారు సాధారణ దొంగల్లా వచ్చి డబ్బు కాజేసుకుని వెళ్లలేదు. కాస్త కొత్తరకంగా ప్రయత్నం చేశారు. జేసీబీతో వచ్చి గోడలు బద్దలు కొట్టి […]

Ram Naramaneni

|

Oct 16, 2019 | 3:59 AM

మాములుగా దొంగలు ఫాస్ట్‌గా మూవ్ అయ్యే వెహికల్స్‌లో వచ్చి తమ పని కానిచ్చేసి వెళ్లిపోతూ ఉంటారు.  కానీ ఇప్పుడు వారు కూడా కొత్త పంథాలను ఎన్నుకుంటారు. కాస్త ఇన్నోవేటీవ్‌గా ఆలోచిస్తూ..ఇంటిలిజెంట్ థీవ్స్ అనిపించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఐర్లాండ్‌లో జరిగిన ఓ ఏటీఎం చోరీ  అందర్నీ ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే అక్కడ ఏటీఎం చోరీకి వచ్చిన వారు సాధారణ దొంగల్లా వచ్చి డబ్బు కాజేసుకుని వెళ్లలేదు. కాస్త కొత్తరకంగా ప్రయత్నం చేశారు. జేసీబీతో వచ్చి గోడలు బద్దలు కొట్టి ఏకంగా డబ్బుల యంత్రాన్ని కొల్లగొట్టుకుపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ఐర్లాండ్‌లో కొందరు దుండగులు ఓ ఏటీఎం కేంద్రాన్ని చోరీ చేసేందుకు మాస్కులు ధరించి వచ్చారు. వారు ఏకంగా జేసీబీతో ఏటీఎం కేంద్రం గోడలు బద్దలు కొట్టి సరాసరి యంత్రాన్ని లేపి తమ వాహనంలో వేసుకుని పరారయ్యారు. కానీ జేసీబీ మాత్రం అక్కడే వదిలేసి వెళ్లారు. అది కూడా దొంగిలించిందో, అద్దెకు తెచ్చుకుందో కాబోలు.  ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి.  అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. చోరీ కోసం దొంగల ఉపాయంపై నెటిజన్లు వ్యంగ్యంగా సెటైర్లు వేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu