ఏపీలో దారుణం..విలేకరిని కత్తులతో నరికి చంపిన దుండగులు
ఏపీలో ఓ పత్రికా విలేకరి దారుణంగా హత్యకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి అర్బన్ విలేకరిగా పనిచేస్తున్న కాతా సత్యనారాయణను దుండగులు కిరాతకంగా నరికి చంపారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆయన్ను హత్య చేశారు. సత్యనారాయణ ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. ఎస్.అన్నవరం గ్రామ సమీపంలోని లక్ష్మీదేవి చెరువు గట్టుపై విలేకరిని అడ్డగించిన దుండగులు కత్తులతో దాడి చేసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. […]

ఏపీలో ఓ పత్రికా విలేకరి దారుణంగా హత్యకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి అర్బన్ విలేకరిగా పనిచేస్తున్న కాతా సత్యనారాయణను దుండగులు కిరాతకంగా నరికి చంపారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆయన్ను హత్య చేశారు. సత్యనారాయణ ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. ఎస్.అన్నవరం గ్రామ సమీపంలోని లక్ష్మీదేవి చెరువు గట్టుపై విలేకరిని అడ్డగించిన దుండగులు కత్తులతో దాడి చేసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సత్యనారాయణ మృతి వార్తతో కుటుంబంలో తీరని విషాదఛాయలు అలముకున్నాయి.
ప్రభుత్వం సీరియస్:
విలేకరి సత్యనారాయణ హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డీజీపీని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఘటనపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీతో డీజీపీ సవాంగ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఎస్పీని డీజీపీ ఆదేశించారు.
విలేఖరి హత్యను ఖండించిన జనసేనాని:
విలేఖరి మర్డర్‌ను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఇది ఆటవి చర్యని, ప్రజస్వామాన్యానికి మూలస్తంభమైన జర్నలిజాన్ని చంపినట్లుగా ఈ ఘటన ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వెనక పెద్ద కుట్ర ఉందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో ఓసారి సత్యనారాయణపై హత్యాయత్నం జరిగిందని.. అది పోలీసుల వరకు వెళ్లినా ఆయనకు రక్షణ కల్పించలేకపోయారని పవన్ పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షించి జర్నలిస్టు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Killing of journalist a barbaric act- JanaSena Chief @PawanKalyan pic.twitter.com/lNncnsKrKk
— JanaSena Party (@JanaSenaParty) October 15, 2019