మరోసారి ముక్కుసూటిగా..నో పాలిటిక్స్..!!

మరోసారి ముక్కుసూటిగా..నో పాలిటిక్స్..!!

దేశంలో బీజేపీ ఎంత రైజింగ్‌లో ఉందన్న విషయం అందరికి తెలిసిందే. మోదీ- షా ద్వయం దేశవ్యాప్తంగా కాషాయజెండా ఎగరవేయాలని ఉవ్వీళ్లూరుతోంది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. కలిసొచ్చేవారిని కలుపుకుంటూ..కయ్యానికి కాలు దువ్వేవారి బెండు తీస్తూ ముందుకుసాగుతోంది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతుండుంతో..రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడే నేతలు సైతం సైలెంట్ అవ్వక తప్పడం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహారణ..ఇటీవలే మోదీతో అస్సలు పొసగని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా […]

Ram Naramaneni

|

Oct 16, 2019 | 5:32 AM

దేశంలో బీజేపీ ఎంత రైజింగ్‌లో ఉందన్న విషయం అందరికి తెలిసిందే. మోదీ- షా ద్వయం దేశవ్యాప్తంగా కాషాయజెండా ఎగరవేయాలని ఉవ్వీళ్లూరుతోంది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. కలిసొచ్చేవారిని కలుపుకుంటూ..కయ్యానికి కాలు దువ్వేవారి బెండు తీస్తూ ముందుకుసాగుతోంది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతుండుంతో..రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడే నేతలు సైతం సైలెంట్ అవ్వక తప్పడం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహారణ..ఇటీవలే మోదీతో అస్సలు పొసగని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..తెలంగాణ సీఎం కేసీఆర్ విడివిడిగా భేటీ అయ్యి చర్చలు జరపడం.

కాగా ప్రస్తుతం బీజేపీ అధినాయకత్వం త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా దీదీకి చెక్ పెట్టేందుకు పశ్చిమ బెంగాల్‌లో అంతర్గత ప్రణాళికలు రచిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ మంచి ఫలితాలను అందుకున్న నేపథ్యంలో.. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు గట్టిగా సమాయత్తం అవుతోంది.

అందులో భాగంగానే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి బీజేపీ ప్రాధాన్యతను ఇస్తోందని వార్తలు వస్తున్నాయి. గంగూలీని ఏకంగ్రీవంగా బీసీసీఐ ప్రెసిడెంట్ గా చేసేందుకు బీజేపీ సహకారం అందించిందని ప్రచారం జరుగుతోంది. తద్వారా మంచి ఇమేజ్ ఉన్న దాదా మద్దతు కూడగట్టి ఎన్నికల్లే లబ్ది పొందొచ్చన్నది బీజేపీ ప్లాన్‌గా తెలుస్తోంది. ఇటీవలే అమిత్ షా- గంగూలీల సమావేశం ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆయన మద్దతు పలికేలా అమిత్ షా ఒప్పించారని అందుకే ఆయనకు బీసీసీఐ పగ్గాలను అప్పగిస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. అమిత్ షా- గంగూలీల మధ్య ఆ డీల్ జరిగినట్టుగా రూమర్స్ విసృతంగా వ్యాపించాయి. అమిత్ షా కూడా ఇటీవల మాట్లాడుతూ..గంగూలీ బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని..బీసీసీఐ ఎన్నిక విషయంలో ఎటువంటి డీల్ లేదని స్పష్టం చేశారు.

అయితే ఉన్నది ఉన్నట్టు సూటిగా మాట్లాడే దాదా..తాజా రూమర్స్‌పై స్పందించాడు.  తను బీజేపీతో ఎలాంటి రాజకీయ ఒప్పందాన్నీ చేసుకోలేదని తేల్చి చెప్పాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని… అమిత్ షాతో సమావేశంలో అలాంటి ఒప్పందాలు చేసుకోలేదని కుండబద్ధలు కొట్టాడు. అంతే  కాదు… తను బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నందుకు తనను అభినందించిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా దాదా కృతజ్ఞతలు  తెలిపాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu