AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీసీసీఐలో దాదా గిరి.. కోహ్లీ కెప్టెన్సీకి ఎసరేనా?

బీసీసీఐ అధ్యక్షుడిగా బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. ఈ నెల 23న కొత్త టీమ్‌తో బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియాలో భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు బీసీసీఐ పాలన సీఓఏ చేతుల్లో ఉండేది. అందుకే టీమిండియా ప్రదర్శనపై సమీక్ష అనేది లేకుండా పోయింది. అంతేకాక కెప్టెన్ విరాట్ కోహ్లీ- కోచ్ రవిశాస్త్రి కనుసన్నల్లోనే జట్టు కూర్పు జరిగేది. అంతేకాక ఈ ఇద్దరూ చెప్పినట్లుగానే అంతా జరుగుతోందని […]

బీసీసీఐలో దాదా గిరి.. కోహ్లీ కెప్టెన్సీకి ఎసరేనా?
Ravi Kiran
|

Updated on: Oct 16, 2019 | 5:37 PM

Share

బీసీసీఐ అధ్యక్షుడిగా బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. ఈ నెల 23న కొత్త టీమ్‌తో బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియాలో భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు బీసీసీఐ పాలన సీఓఏ చేతుల్లో ఉండేది. అందుకే టీమిండియా ప్రదర్శనపై సమీక్ష అనేది లేకుండా పోయింది. అంతేకాక కెప్టెన్ విరాట్ కోహ్లీ- కోచ్ రవిశాస్త్రి కనుసన్నల్లోనే జట్టు కూర్పు జరిగేది.

అంతేకాక ఈ ఇద్దరూ చెప్పినట్లుగానే అంతా జరుగుతోందని బహిర్గతంగా కూడా మాటలు వినిపించాయి. ఇటీవల జట్టులో చెలరేగిన గొడవలు దగ్గర నుంచి సహాయక కోచ్‌ల మార్పులు వరకు ఇదే తంతు. జట్టు కూర్పు విషయానికి వస్తే.. ఈ ఇద్దరూ తమకు నచ్చిన వాళ్ళను తీసుకుంటున్నారే తప్ప.. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన వారికీ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈ విషయాన్ని నిరూపించడానికి ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలే సాక్ష్యాలు.

ఇది ఇలా ఉండగా భారత్ జట్టు 2013 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది లేదు. అటు ధోని సారధ్యంలో వచ్చిన టీ20, వన్డే వరల్డ్ కప్ తప్ప మరే మెగా టోర్నీలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. ఇక రీసెంట్‌గా ప్రపంచకప్ టోర్నీ గురించి మాట్లాడితే భారత్ జట్టు తీవ్రంగా నిరాశ పరిచిందని చెప్పవచ్చు. అంతేకాక వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఆటతీరుపై గంగూలీ అదే పనిగా విమర్శించాడు కూడా. వరుసగా ఏడు ఐసీసీ టోర్నీల్లో జట్టు వైఫల్యాలను ఎట్టి చూపాడు. విరాట్ ఏదో ఒక ఫార్మటు నుంచి కెప్టెన్‌గా తప్పుకోవాలని.. జట్టు కూర్పు కూడా సరిలేదని చెప్పాడు. అటు అంబటి రాయుడు లాంటి ప్లేయర్స్‌ను కూడా దూరం పెట్టడంపై కూడా దాదా మండిపడ్డాడు.

విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమ్ స్వదేశంలో అద్భుత విజయాలు అందుకుంటోంది తప్ప.. విదేశాల్లో అంతగా రాణించట్లేదు. అంతేకాక మిడిల్ ఆర్డర్ పెద్ద ప్రాబ్లెమ్. మరోవైపు రవిశాస్త్రిపై కూడా వేటు పడే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు బీసీసీఐ బాస్‌గా గంగూలీ బాధ్యతలు చేపట్టనుండగా.. టీమిండియాకు మంచి రోజులు రానున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు. అటు కోహ్లీ కెప్టెన్సీకు కూడా సవాల్ ఇప్పుడు ఎదురవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే దాదా సారధ్యంలో జైషా సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా జయేష్ జార్జీ.. ట్రెజరర్‌గా అరుణ్ ధుమాల్.. వైస్ ప్రెసిడెంట్‌ మహీమ్ వర్మ బాధ్యతలు చేపట్టనున్నారు.