శాస్త్రికి చెక్.. గంగూలీ ఫస్ట్ స్టెప్ అదేనా..?

శాస్త్రికి చెక్.. గంగూలీ ఫస్ట్ స్టెప్ అదేనా..?

టీమిండియా మాజీ కెప్టన్.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు పోటీగా ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో.. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా “దాదా” ఎంపిక అయినట్లే. ఇక అధికారికంగా బోర్డు ప్రకటించడమే తరువాయి. అక్టోబర్ 23న గంగూలీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో దాదా అధ్యక్ష్య పదవి చేపడితే.. ఇక ఆయన చేసే సంస్కరణలు ఏంటీ.. ఆయనకు ఎదురయ్యే సవాళ్లేంటే అన్నదానిపై […]

TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Oct 15, 2019 | 7:56 PM

టీమిండియా మాజీ కెప్టన్.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు పోటీగా ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో.. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా “దాదా” ఎంపిక అయినట్లే. ఇక అధికారికంగా బోర్డు ప్రకటించడమే తరువాయి. అక్టోబర్ 23న గంగూలీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో దాదా అధ్యక్ష్య పదవి చేపడితే.. ఇక ఆయన చేసే సంస్కరణలు ఏంటీ.. ఆయనకు ఎదురయ్యే సవాళ్లేంటే అన్నదానిపై సోషల్ మీడియా వేదికగా ఫుల్ డిస్కషన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. అదే గంగూలీ, రవిశాస్త్రి వార్.

దాదాకి రవిశాస్త్రికి మధ్య వార్ ఎంటీ అని ఆశ్చర్యపోతున్నారా.. అవును గతంలో ఇద్దరి మధ్య ఓ విషయంలో అభిప్రాయబేధాలు వచ్చాయి. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది వీరి మధ్య దూరం. 2016లో టీమిండియా కోచ్‌ పదవికి పోటీ చేయగా.. అప్పుడు రవిశాస్త్రి కాలేకపోయాడు. దానికి దాదానే కారణమని రవిశాస్త్రి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక సార్లు విమర్శలకు దిగారు. అయితే గంగూలీ మాత్రం మౌనంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు రవిశాస్త్రిపై దాదా రివేంజ్ తీసుకునే అవకాశం వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రవిశాస్త్రి భవిష్యత్ ఏంటని నెటిజన్లు జోక్‌లు వేసుకుంటున్నారు. తనకు శత్రువులైన వారందినినీ తొలగించి.. దాదా తన కొత్త బ్యాచ్‌ ఏర్పరుచుకుంటాడంటూ మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

అసలు కథ ఏంటంటే..

2016లో టీమిండియా హెడ్ కోచ్‌ ఎంపిక కోసం బీసీసీఐ సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని నియమించింది. దీనిలో భాగంగా ఈ కమిటీ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఇంటర్యూలు నిర్వహించింది. అయితే ఆ సమయంలో రవిశాస్త్రి ఇంటర్వ్యూకు అందుబాటులో లేరు. అయితే స్కైప్ ద్వారా తన ఇంటర్వ్యూ కొనసాగించారు. స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొనడాన్ని కమిటీలోని సభ్యలు లక్ష్మణ్‌, సచిన్‌లు స్వాగతించినప్పటికీ గంగూలీ మాత్రం తప్పుబట్టాడు.కోచ్ పదవీ అంటే ఆషామాషీ కాదని.. కనీసం ఇంటర్వ్యూకు వచ్చే తీరిక కూడా లేని వ్యక్తిని కోచ్‌గా ఎందుకు ఎంపిక చేయాలనే వాదనను గంగూలీ గట్టిగా వినిపించాడు.

అయితే అదే సమయంలో మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేని హెడ్ కోచ్‌గా ఎంపికవడంలో “దాదా” కీలకపాత్ర పోషించాడు. దీంతో తనకు కోచ్‌ పదవి రాకుండా గంగూలీనే అడ్డుకున్నాడని రవిశాస్త్రి బహిరంగం విమర్శలకు దిగాడు. ఆ తర్వాత కోహ్లీతో విభేదాలు తలెత్తడంతో కుంబ్లే తన కోచ్ పదవికి రాజీనామా చేశాడు. అనంతరం సీఏసీ రవిశాస్త్రినే తిరిగి కోచ్‌గా ఎంపిక చేసింది. ఆ సమయంలో కూడా రవిశాస్త్రి ఎంపిక పట్ల దాదా ఆసక్తి చూపలేదు. దరఖాస్తు చేసుకున్న వారందరిలో రవిశాస్త్రినే బెటర్‌ అనిపించడంతో చేసేదేమి లేక కోచ్‌గా ఎంపిక చేశారు. దీంతో ఈ కథకి ఎండ్ కార్డ్ పడ్డట్లయ్యింది.

దాదా.. శాస్త్రీపై రివేంజ్ తీసుకుంటాడా.. ?

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న చర్చకు, వాస్తవానికి సంబంధం లేదు. ఎందుకంటే.. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయినప్పటికీ రవిశాస్త్రి విషయంలో అతడు ఏమీ చేయలేడు. ఎందుకంటే ఈ పదవిలో దాదా సెప్టెంబర్ 2020 వరకు మాత్రమే కొనసాగనున్నాడు. అయితే ఇటీవలే రెండోసారి రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా తిరిగి ఎన్నికైన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు శాస్త్రి హెడ్ కోచ్‌గా బాధ్యతలు అందించనున్నాడు. సో గంగూలీ బీసీసీఐ అధ్యక్ష్యుడు అయినా.. ఏం చేయలేడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu