Wealth Astrology: శుభ గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
డిసెంబర్ 21 నుండి జనవరి 12 వరకు గురు, శుక్ర గ్రహాలు కొన్ని రాశుల వారికి అనుకూలంగా మారనున్నాయి. ఈ కాలంలో మిథునంలో గురువు, ధనస్సులో శుక్రుడు పరస్పరం వీక్షించుకోవడంతో మేషం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశులకు అపార ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగం, వ్యాపారం, షేర్లు, ఆస్తి లావాదేవీల ద్వారా సంపద గణనీయంగా పెరుగుతుంది. ఇది ఆరు రాశుల వారికి కుబేర యోగాన్ని ప్రసాదిస్తుంది.

Wealth Astrology
జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు, శుక్రులు అత్యంత శుభ గ్రహాలు. ఏ రాశికైనా ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్న పక్షంలో ఆ రాశివారి సంపద ఆకాశమే హద్దుగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇందులో గురువు దేవతల గురువు కాగా, శుక్రుడు రాక్షసుల గురువు. గురువు సక్రమ సంపాదనకు, శుక్రుడు అక్రమ సంపాదనకు కారకులు. ఈ నెల (డిసెంబర్) 21 నుంచి జనవరి 12 వరకు ఈ రెండు శుభ గ్రహాలు పరస్పరం వీక్షించుకోవడం జరుగుతోంది. మిథున రాశిలో ఉన్న గురువు, ధనూ రాశిలో ఉన్న శుక్రుడు ఒకరినొకరు చూసుకోవడం వల్ల మేషం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశుల వారు ‘ఎడా పెడా’ సంపాదించే అవకాశం ఉంది.
- మేషం: ధనాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి గురువు ఒకరినొకరు చూసుకోవడం వల్ల ఈ రాశివారి ఆదాయం అనేక మార్గాల్లో బాగా వృద్ది చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా అదనపు ఆదాయం, రాబడి బాగా పెరుగుతాయి. రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, రియల్ ఎస్టేట్ వారికి ఈ యోగం కనక వర్షం కురిపిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల కూడా ఆదాయం పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
- మిథునం: ఈ రాశిలో ఉన్న గురువు, సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడు పరస్పరం వీక్షించుకోవడం వల్ల ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు అదనపు ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై, ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి.
- సింహం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న గురువు, పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు ఒకరినొకరు వీక్షించు కోవడం వల్ల కొద్ది ప్రయత్నంతో అపార ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక దన ప్రాప్తి కలగడంతో పాటు ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సిద్ధిస్తాయి. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. లాభదాయక ఒప్పందాలు ఏర్పడతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతాయి.
- కన్య: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న గురువు, చతుర్థ స్థానంలో ఉన్న శుక్రుడు ఒకరినొకరు చూసుకోవడం వల్ల కొద్ది ప్రయత్నంతోనే కాక, అప్రయత్నంగా కూడా ధన లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్, రాజకీయ రంగాల్లో ఉన్నవారికి అనేక వైపుల నుంచి ధన ప్రవాహం ఉంటుంది. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందే అవకాశం ఉంది.
- తుల: తృతీయ స్థానంలో ఉన్న రాశ్యదిపతి శుక్రుడు, భాగ్య స్థానంలో ఉన్న గురువు పరస్పరం వీక్షించు కోవడం వల్ల ఈ రాశివారికి కుబేర యోగం, ధన లక్ష్మీ యోగం, ధన ధాన్య సమృద్ధి యోగం వంటివి కలుగుతున్నాయి. వీటి వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అపార ధన లాభం కలిగి, అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి వృద్ధి చెందుతాయి. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది.
- కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న శుక్రుడు, పంచమ స్థానంలో ఉన్న గురువు ఒకరినొకరు చూసుకోవడం వల్ల అదనపు ఆదాయ మార్గాలు అత్యధికంగా ఆదాయాన్ని వృద్ధి చేస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల ద్వారా కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. తల్లి తండ్రుల వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. రావలసిన సొమ్ముతో పాటు రాదనుకున్న సొమ్ము కూడా వసూలవుతుంది.



