రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం.. టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ అయితే.. ఫ్రీ రైడ్..!
Fast Tag At Toll Plaza: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్‌కు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే జాతీయ రహదారులపై ఉన్న 770 టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ తప్పనిసరి చేసిన..
Fast Tag At Toll Plaza: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్‌కు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే జాతీయ రహదారులపై ఉన్న 770 టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ తప్పనిసరి చేసిన ఎన్‌హెచ్ఏఐ.. మార్చి 1వ తేదీ వరకు ఫ్రీ ఫాస్ట్ ట్యాగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. దీనిని నివారించేందుకు రోడ్లు రవాణా మంత్రిత్వ శాఖ మరో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్‌హెచ్‌లలోని ప్రతి టోల్ ప్లాజా వద్ద ఒక ప్రత్యేకమైన రంగుతో లైన్‌ను ఏర్పాటు చేయనుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఒకవేళ టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ భారీగా పెరిగితే.. ఆ నిర్దిష్ట సమయంలో అన్ని వాహనాల కోసం టోల్ ఆపరేటర్ గేట్ తెరవాల్సి ఉంటుంది.
ఫాస్టాగ్ తప్పనిసరి చేసిన అనంతరం కేవలం రెండు రోజుల వ్యవధిలో ఫాస్టాగ్ వినియోగించేవారి సంఖ్య 90 శాతానికి చేరుకుంది. ఒక్క రోజులో ఫాస్టాగ్ ద్వారా 63 లక్షల లావాదేవీలతో రూ.100 కోట్ల టోల్‌ను దేశవ్యాప్తంగా వసూలు చేశారు. గత రెండు రోజుల్లో 2.5 లక్షలకు పైగా ట్యాగ్స్ సేల్స్ జరిగినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ నేపథ్యంలో వాహనదారులు నీరిక్షించకుండా ఉండేందుకు వీలుగా రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ.. టోల్ ప్లాజాల దగ్గర ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేయనుంది.
Also Read: