Mathura – Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న కారును ఈ రోజు తెల్లవారుజామున ఆయిల్ ట్యాంకర్ ఢికొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు మధుర ఎస్‌ఎస్‌పి గౌరవ్ గ్రోవర్ వెల్లడించారు.
Also Read: