పాస్టర్ మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించిన యువతి.. బాధితురాలికి అండగా నిలిచిన నటి కరాటే కల్యాణి..

ఓ పాస్టర్‌ తనను నమ్మించి మోసం చేశాడని రాజమహేంద్రవరంలో ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సినీ నటి

పాస్టర్ మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించిన యువతి.. బాధితురాలికి అండగా నిలిచిన నటి కరాటే కల్యాణి..
Follow us
uppula Raju

|

Updated on: Feb 24, 2021 | 4:45 AM

ఓ పాస్టర్‌ తనను నమ్మించి మోసం చేశాడని రాజమహేంద్రవరంలో ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సినీ నటి కరాటే కల్యాణి సాయంతో బాధితురాలు రెండోపట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన ఓ యువతి ఆల్కట్‌తోట సమీపంలోని ఓ ప్రార్థనా మందిరానికి వచ్చేది. అక్కడి పాస్టర్‌ ఎన్‌జే షరోన్‌ కుమార్‌ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. గట్టిగా నిలదీస్తే నగ్న వీడియోలు బయట పెడతానని.. బయటికి చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ ఎదుట కరాటే కల్యాణి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ వచ్చిన బాధితురాలు ఇటీవలే తనను కలిసిందని, ఆమెకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి నేరుగా రాజమహేంద్రవరం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Central Electoral Commission: బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలపై కసరత్తు..

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?