రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్‌ 1 నుంచి పట్టాలెక్కనున్న గుంటూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్

కరోనా కేసులు తగ్గుముఖంపడుతుండటంతో ఆగిన రైళ్లను పట్టాలెక్కించేందుకు భారత రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..  ఏప్రిల్‌ 1 నుంచి పట్టాలెక్కనున్న గుంటూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్
Balaraju Goud

|

Feb 24, 2021 | 8:55 AM

Express train : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కరోనా కేసులు తగ్గుముఖంపడుతుండటంతో ఆగిన రైళ్లను పట్టాలెక్కించేందుకు భారత రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంగా తన సర్వీసుల్లో మార్పులు చేయడం, అదనపు సర్వీసులు కల్పించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా గుంటూరు-కాచిగూడ-గుంటూరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏప్రిల్‌ 1 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

కరోనా లాక్‌డౌన్ విధించడంతో నిలిచిపోయిన ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెస్తున్నారు. ఈ రైలు ఏప్రిల్‌ 1 న రాత్రి 7 గంటలకు గుంటూరులో బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, డోన్‌, కర్నూల్‌ సిటీ, జోగులాంబ గద్వాల, వనపర్తి రోడ్‌, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌ మీదుగా మర్నాడు ఉదయం 9.45 గంటలకు కాచిగూడకు వెళ్తుంది. ఏప్రిల్‌ 2 న కాచిగూడలో మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరి షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తిరోడ్, జోగులాంబ గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ, నరసరావుపేట మీదుగా మర్నాడు ఉదయం 6.45కి గుంటూరు వెళ్తుంది.

ఎక్స్‌ప్రెస్‌లు ఎన్ని వస్తున్నా… దేశంలో చాలా మంది ప్రజలు ప్యాసింజర్ రైళ్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య ఏప్రిల్ నుంచి వస్తాయని ప్రచారం జరిగినా… అలాంటిదేమీ లేదని రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. దశలవారీగా రైళ్లను తిరిగి తెస్తామని చెప్పింది. అయితే ఎప్పటి నుంచి ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెడుతుందన్న దానిపై భారత రైల్వే శాఖ స్పష్టం చేయలేకపోతుంది. అలాగే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65 శాతం రైళ్లు.. ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

తాజాగా కొన్ని టూరిజం ప్యాకేజీలను IRCTC ప్రకటిస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu