గుడ్ న్యూస్.. భారత్, ఆస్ట్రేలియా టెస్ట్‌కు ప్రేక్షుకులకు అనుమతి.?

క్రికెట్ లవర్స్‌కు ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు(సీఏ) గుడ్ న్యూస్ అందించింది. డిసెంబర్ 26-30 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు...

గుడ్ న్యూస్.. భారత్, ఆస్ట్రేలియా టెస్ట్‌కు ప్రేక్షుకులకు అనుమతి.?
Follow us

|

Updated on: Oct 28, 2020 | 9:32 PM

India tour of Australia: క్రికెట్ లవర్స్‌కు ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు(సీఏ) గుడ్ న్యూస్ అందించింది. డిసెంబర్ 26-30 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు ప్రేక్షకులను అనుమతించాలని క్రికెట్ ఆస్ట్రేలియా యోచిస్తోంది. రోజుకు 25 వేల మంది చొప్పున ఐదు రోజులకు గానూ మొత్తంగా లక్షా 25 వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని అనుకుంటోందట. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందట.

ప్రపంచంలోని రెండో అతిపెద్ద స్టేడియమైన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బాక్సింగ్ డే టెస్ట్ జరగనుంది. అప్పటి కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిబంధనలను సడలించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోందని సమాచారం. కాగా, కోవిడ్- 19 కారణంగా ఇప్పటివరకు జరిగిన ఏ ఒక్క మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించలేదు. అంతేకాదు ఆటగాళ్లందరిని బయోబబుల్ వాతావరణంలో ఉంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు.

Also Read:

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..