ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

ఐపీఎల్ 2020లో జోరుమీదున్న ముంబై ఇండియన్స్‌కు షాక్ తగిలింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది.

  • Ravi Kiran
  • Publish Date - 8:22 am, Tue, 27 October 20

Rohit Sharma Ruled Out: ఐపీఎల్ 2020లో జోరుమీదున్న ముంబై ఇండియన్స్‌కు షాక్ తగిలింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఫ్రాంచైజీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఆస్ట్రేలియా పర్యటనకు అతడు ఎంపిక కాకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇప్పటికే గత రెండు మ్యాచ్‌ల్లో ముంబై తరపున రోహిత్ బరిలోకి దిగలేదు. హిట్‌మ్యాన్ స్థానంలో పొలార్డ్ జట్టుకు సారధిగా వ్యవహరించాడు. గతవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మకు గాయమైన సంగతి తెలిసిందే. కాగా, ఒకవేళ రోహిత్ శర్మ తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోతే ముంబై ఇండియన్స్ గట్టి ఎదురుదెబ్బేనని చెప్పాలి. కానీ తాజాగా ముంబై ఇండియన్స్ హిట్‌మ్యాన్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టిస్ చేస్తున్న ఫోటోలను విడుదల చేయడం మరో చర్చకు దారి తీస్తోంది.

 

View this post on Instagram

 

Just what we love to see! Hitman in action at today’s training 😍 #OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @rohitsharma45

A post shared by Mumbai Indians (@mumbaiindians) on