రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..

కరోనాతో పోరాడుతున్న హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు తాజాగా హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య నిలకడగా ఉందని..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..
Follow us

|

Updated on: Oct 27, 2020 | 5:19 PM

Actor Rajasekhar: కరోనాతో పోరాడుతున్న హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు తాజాగా హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య నిలకడగా ఉందని.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని సిటీ న్యూరో సెంటర్ వైద్యుడు రత్నకిషోర్ తెలిపారు. ఈరోజు రాజశేఖర్‌కు ప్లాస్మా థెరపీ కూడా చేశామని.. సైటోసోర్బ్ పరికరం ద్వారా చికిత్స చేస్తున్నామని తెలిపారు.

గతంతో పోలిస్తే.. ఇప్పుడు రాజశేఖర్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. వైద్యానికి స్పందిస్తున్నారన్నారు. నిరంతరం వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని సిటీ న్యూరో సెంటర్ ప్రకటనను విడుదల చేసింది. కాగా, రాజశేఖర్ సతీమణి జీవిత కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. ఆమెకు పరీక్షల్లో నెగటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.