AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG ODI : టెస్ట్ ముగిసింది.. వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..

IND vs AFG ODI : ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు లో భారీ మార్పులు జరిగాయి. టెస్ట్ స్క్వాడ్ నుంచి ఏడుగురు ఆటగాళ్లు తప్పుకోగా, రోహిత్, కోహ్లీ సహా ఏడుగురు కొత్తగా చేరారు.

IND vs AFG ODI : టెస్ట్ ముగిసింది.. వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
Ind Vs Afg Odi
Rakesh
|

Updated on: Jun 08, 2026 | 7:42 PM

Share

IND vs AFG ODI : ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ విజయం సాధించిన జోష్‌లో ఉన్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుండగా, ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ పూర్తిగా మార్చేసింది. టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే 15 మంది ఉండే భారత జట్టులో ఏకంగా 7 మార్పులు జరిగాయి. టెస్టుల్లో ఆడిన ఏడుగురు ఆటగాళ్లు జట్టును వీడగా, వన్డేల కోసం మరో ఏడుగురు స్టార్ ప్లేయర్లు జట్టులోకి వచ్చారు.

టెస్ట్ సిరీస్ తర్వాత బయటకు వెళ్లిన ప్లేయర్స్ వీళ్లే

నిజానికి సెలెక్టర్లు ముందే ప్లాన్ చేసిన ప్రకారం రెండు సిరీస్‌లకు వేర్వేరుగా ఆటగాళ్లను ఎంపిక చేశారు. కేవలం టెస్ట్ మ్యాచ్ కోసమే ఎంపికైన ఓపెనర్లు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్‌లతో పాటు స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, టెస్ట్ డెబ్యూ హీరో మానవ్ సుతార్, ధ్రువ్ జురెల్‎లు ఇప్పుడు జట్టుకు దూరం కానున్నారు. వీరి స్థానంలో వన్డే ఫార్మాట్ నిపుణులు జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నారు.

వన్డే జట్టులోకి వచ్చిన ఏడుగురు స్టార్స్

ఆఫ్ఘన్‌తో వన్డే సిరీస్ కోసం టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, యువ ఆటగాడు ప్రిన్స్ యాదవ్ లు కొత్తగా వన్డే స్క్వాడ్‌లో చేరారు. కాగా, రెండు ఫార్మాట్లలోనూ కలిపి కేవలం 8 మంది ఆటగాళ్లను మాత్రమే కామన్‌గా ఎంపిక చేశారు. ఈ వన్డే సిరీస్‌కు కూడా శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చూసుకోనున్నాడు.

విరాట్ కోహ్లీ గాయంపై సస్పెన్స్

టీమిండియా వన్డే జట్టును ప్రకటించినప్పుడు విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, స్క్వాడ్ అనౌన్స్ అయిన తర్వాత కొన్ని క్రీడా నివేదికల ప్రకారం కోహ్లీ ప్రస్తుతం హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ గాయం కారణంగా అతను ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే పూర్తి వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే కోహ్లీ స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల లభ్యత కూడా వారి ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంది.

ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ పూర్తి షెడ్యూల్

భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగబోయే ఈ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది. మొదటి వన్డే మ్యాచ్ జూన్ 13 (శనివారం)న ధర్మశాల వేదికగా బ్యూటిఫుల్ హెచ్‌పీసీఏ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత రెండో వన్డే మ్యాచ్ జూన్ 17 (బుధవారం)న లక్నోలో నిర్వహిస్తారు. ఇక సిరీస్‌లో ఆఖరిదైన మూడో వన్డే మ్యాచ్ జూన్ 20 (శనివారం)న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. టెస్ట్ సిరీస్ లాగే వన్డే సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us