మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నవంబర్ 2వ తేదీ నుంచి స్కూళ్లను పున: ప్రారంభించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్కూళ్లలో మధ్యాహ్న భోజన పధకానికి..

  • Ravi Kiran
  • Publish Date - 12:59 pm, Tue, 27 October 20
Enrollment In Government Schools

AP Government Key Decision: నవంబర్ 2వ తేదీ నుంచి స్కూళ్లను పున: ప్రారంభించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్కూళ్లలో మధ్యాహ్న భోజన పధకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలు దృష్ట్యా మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేసే సమయంలో వాచ్, రింగులు, గాజులు, బంగారం ధరించకూడదని.. గోళ్ల రంగులు వేసుకోకూడదని స్పష్టం చేసింది. అలాగే ప్రతీ రోజూ కూరగాయలను ఉప్పు-పసుపుతో శుభ్రం చేయాలని సూచించింది. అటు భోజన సమయంలో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా.. పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపింది.

మరోవైపు స్కూళ్లకు చిన్న పిల్లలు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో ఎక్కడైనా కూడా టీచర్లు కరోనా పరీక్షలు చేయించుకోవచ్చునని తెలిపిన ప్రభుత్వం.. వాటి రిపోర్టులను ఉన్నతాధికారులకు పంపించాలని పేర్కొంది.