Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణలో మరికొన్ని కొత్త మండలాల ఏర్పాటు.. నెరవేరిన చిరకాల కోరిక..

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో కొత్తగా మండలాలను ఏర్పాటు చేసింది.

Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణలో మరికొన్ని కొత్త మండలాల ఏర్పాటు.. నెరవేరిన చిరకాల కోరిక..
Telangana Govt
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 28, 2021 | 6:27 PM

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో కొత్తగా మండలాలను ఏర్పాటు చేసింది. వీటి ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట జిల్లాలో కొత్తగా గుండుమాల్, కొత్తపల్లె మండలాలు ఏర్పాటు చేయగా.. వికారాబాద్ జిల్లాల్లో కొత్తగా దూడ్యాల్ మండలాన్ని ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను రెవెన్యూ శాఖ జారీ చేసింది. వీటి ఏర్పాటుకు సంబంధించి నెల రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులు ఇవ్వాలని ప్రభుత్వం సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది.

కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లోని ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల కొత్తగా ఏర్పాటైన మండలాల్లోని ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞలు తెలిపారు.

Also read:

Rashmika Mandanna: తగ్గేదే లే అంటున్న రష్మిక.. చేతిలో అర డజన్‏కు పైగా సినిమాలు.. మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..

Viral Video: జింబాబ్వే- బంగ్లాదేశ్ టీంల మధ్య జరిగిన వింత ఘటన.. వికెట్‌ తీసిన దెయ్యం… వీడియో

Telangana MLC: తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు