Telangana MLC: తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు

తెలంగాణ మరో ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది.

Telangana MLC: తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు
Telangana Council
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 28, 2021 | 6:06 PM

Telangana MLC Elections: తెలంగాణ మరో ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్‌ 3వ తేదీతో ముగిసింది. తిరిగి అయా స్థానాలకు కొత్త శాసన మండలి సభ్యులను ఎన్నుకోవల్సి ఉంది. ఇటీవల పది కాలం పూర్తైన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌, ఆకుల లలిత ఉన్నారు. వీరి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకోనున్నారు.

సాధారణంగా గడువు ముగిసే సమయానికంటే ముందే ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తుంది. అయితే, దేశవ్యాప్తంగా కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత నేపథ్యంలో అప్పట్లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదని స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం… ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని ప్రకటించింది. దీంతో జూన్‌ 3 నుంచి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. అయితే, ఈ ఎన్నికలు లాంఛన ప్రాయమే కానున్నాయి. అధికార పార్టీ ఆరు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోనుంది. అత్యధిక ఎమ్మెల్యేలు కలిగిన టీఆర్ఎస్‌కు చెందిన వారే తిరిగి ఎన్నకయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇదిలావుంటే, కోవిడ్‌ ఉద్ధృతి తగ్గి అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందినట్టు సమాచారం. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని కోరినట్టు తెలిసింది. ఈసీ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాక ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read Also…  Cyber Crime: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా హైకోర్టు మాజీ న్యాయమూర్తికే టోకరా పెట్టేశారు..