AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12వ శతాబ్దంలో మట్టితో క‌ట్టిన‌ గుండ్రటి అపార్ట్‌మెంట్లు.. విపత్తులు సైతం తట్టుకుంటున్న వైనం.. ఇప్ప‌టి ఇంజ‌నీర్లు షాక్

ఆగ్నేయ చైనాలో ప్రాచీన కాలం నుంచే అపార్టుమెంట్లు ఉండేవి. అయితే, ఇప్పటి అపార్టుమెంట్ల తరహాలో కాకుండా గుండ్రంగా ఉంటాయి. పైగా వాటిని సిమెంట్‌తో కాదు..

12వ శతాబ్దంలో మట్టితో క‌ట్టిన‌ గుండ్రటి అపార్ట్‌మెంట్లు.. విపత్తులు సైతం తట్టుకుంటున్న వైనం.. ఇప్ప‌టి ఇంజ‌నీర్లు షాక్
Fujian Tulou
Ram Naramaneni
|

Updated on: Jun 28, 2021 | 3:48 PM

Share

ఆగ్నేయ చైనాలో ప్రాచీన కాలం నుంచే అపార్టుమెంట్లు ఉండేవి. అయితే, ఇప్పటి అపార్టుమెంట్ల తరహాలో కాకుండా గుండ్రంగా ఉంటాయి. పైగా వాటిని సిమెంట్‌తో కాదు.. మట్టి, చెక్కలతో మాత్రమే నిర్మించారు. అక్కడ అడుగుపెట్టేవారికి ఒక కొత్త‌లోకంలోకి వెళ్తున్న‌ట్టు ఉంటుంది. దాదాపు 12వ శతాబ్దంలో కట్టిన ఈ మట్టి అపార్టుమెంట్లు ఇప్పటికీ స్ట్రాంగ్‌గానే ఉండ‌టం విశేషం. వాటికి అంత స్పెషాలిటీ ఉంది కాబ‌ట్టే యునెస్కో వాటిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇప్ప‌టి ఇంజినీర్లను ఈ కట్టడాలు ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి. ఇవి ఫ్యుజియన్‌లో ఉన్నాయి. వీటిని ‘ఫ్యుజియన్ టులువ్’ అని సంభోదిస్తారు. ఇవి చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంటాయట‌. భూకంపాలను సైతం ఇవి తట్టుకుంటాయని అక్క‌డివారు చెబుతున్నారు. చైనాకు చెందిన పలు యాక్షన్ మూవీస్‌లో ఈ అపార్టమెంట్లను చూడవచ్చు. ఇంత విభిన్న‌మైన‌ ఈ అపార్టుమెంట్లను సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఒక్కో అపార్టుమెంటులో 3 నుంచి 5 ఫ్లోర్స్ ఉన్నాయి. దాదాపు 50 నుంచి 80 ఫ్యామిలీలు ఇక్కడ నివసిస్తున్నాయి. వీటి నిర్మాణానికి ఎక్కడా.. ఇనుము, సిమెంటు వాడకపోవడం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే అంశం. 1.8 మీటర్ల మందం గల ఈ మట్టి గోడల అపార్టుమెంట్లు అన్ని కాలాలను, విప‌త్తుల‌ను తట్టుకుని నిలుస్తున్నాయంటే అప్పటి స్కిల్, నాణ్య‌త ఎలా ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు. వీటిలో కొన్ని గుండ్రంగా ఉంటే.. మరికొన్ని చతురస్ర ఆకారంలో ఉంటాయి. అయితే, గుండ్రంగా ఉండే భవనాలే టూరిస్టుల‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి.

12వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో సాయుధ బందిపోట్లు ఎక్కువగా తిరుగుతూ ఉండేవారు. గ్రామస్థులపై దాడులు చేసి దొరికింది దోచుకొనేవారు. దీంతో, గ్రామస్థులందరినీ ఒకే చోట చేర్చి రక్షణ కల్పించాల‌నే ఉద్దేశంతో గుండ్రని అపార్టుమెంట్లు నిర్మించారు. బందిపోట్లపై తిరిగి అటాక్ చేసేందుకు కూడా ఈ భవనాల్లో ఏర్పాట్లు ఉన్నాయి. తుపాకీలు పట్టేలా గోడాలకు రంధ్రాలు కూడా అప్పుడే ఏర్పాటు చేశారు. దాదాపు 19వ శతాబ్దం వరకు ఇక్కడి ప్రజలు బందిపోట్ల సమస్యతో స‌త‌మ‌త‌మ‌య్యారు. అప్పట్లో ఈ మట్టి టులువ్‌ల తలుపులు ఎప్పుడూ మూసే ఉండేవి. అయితే, ఇప్పుడు పర్యాటకుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వమే ఇప్పుడు ఈ భవనాలకు భద్రత కల్పిస్తోంది.

Also Read: పైకి పైనాపిల్ లోడు.. లోప‌ల చెక్ చేసి ఖంగుతిన్న పోలీసులు

చైనాలో లక్షా నలభై ఏళ్ళనాటి మానవ శిలాజం.. చతురస్రాకారపు కళ్ళతో నివసించిన డ్రాగన్ మేన్ ఆనవాళ్లు!