AP Crime News : పైకి పైనాపిల్ లోడు.. లోపల చెక్ చేసి ఖంగుతిన్న పోలీసులు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం టోల్ గేట్ వద్ద పోలీసులు సోమవారం భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి నెల్లూరు జిల్లా
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం టోల్ గేట్ వద్ద పోలీసులు సోమవారం భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి నెల్లూరు జిల్లా నాయుడుపేట పైనాపిల్ లోడు మాటున లారీలో గంజాయి తరలించేందుకు పక్కా స్కెచ్ వేయగా పోలీసులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2 కోట్ల రూపాయల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ గంజాయి విలువ కేజీ 20 వేల రూపాయల వరకు ఉంటుందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.
విశాఖలో ఊహంచని స్టైల్లో సరఫరా!
సాగర తీరాన్ని పట్టిన నషా ఏ మాత్రం తగ్గటం లేదు. ఎన్ని తనిఖీలు నిర్వహిస్తున్నా..? పటిష్టమైన నిఘా పెడుతున్న గంజాయి సప్లై ఆగడం లేదు. రోజు రోజుకూ గంజాయి గ్యాంగ్ ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయి. రోజు రోజుకో కొత్తకొత్త ఎత్తులు వేస్తు్న్నారు. తాజాగా విశాఖ జిల్లాలో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం పులపర్తి సమీపంలోని జాతీయ రహదారిపై భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ముందస్తు సమాచారంతో జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు.. లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు రెండు వందల కేజీలకు పైగా గంజాయిని పట్టుకున్నారు. లారీని సీజ్ చేశారు. తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీని అనుమానంతో తనిఖీ చేసిన పోలీసులు.. లారీ క్యాబిన్ లో సీటు కింద సీక్రెట్ గా ఏర్పాటు చేసిన లాకర్ గుర్తించారు. సీక్రెట్ లాకర్ లో గంజాయి పెట్టి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..లోతైన దర్యాప్తు చేపట్టారు.
Also Read: దొంగగా మారిన నేవీ అధికారి.. భార్యతో కలిసి నగల దుకాణంలో చోరీ.. దారి తప్పిన విద్యావంతుడు…