Thief: దొంగ‌గా మారిన నేవీ అధికారి.. భార్య‌తో క‌లిసి న‌గ‌ల దుకాణంలో చోరీ.. దారి త‌ప్పిన విద్యావంతుడు…

Thief: అత‌ను ఒక నేవీ ఉద్యోగి విశాఖ‌ప‌ట్నంలో సెయిల‌ర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రేమించి వివాహం చేసుకున్న భార్య‌తో సంతోషమైన జీవితం గ‌డుపుతున్నాడు. మంచి జీతం, స‌మాజంలో గౌర‌వం కానీ దారి త‌ప్పాడు. ఈ విద్యా వంతుడు దొంగ‌గా మారాడు..

Thief: దొంగ‌గా మారిన నేవీ అధికారి.. భార్య‌తో క‌లిసి న‌గ‌ల దుకాణంలో చోరీ.. దారి త‌ప్పిన విద్యావంతుడు...
Navy Sailor Thief
Follow us

|

Updated on: Jun 28, 2021 | 2:52 PM

Thief: అత‌ను ఒక నేవీ ఉద్యోగి విశాఖ‌ప‌ట్నంలో సెయిల‌ర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రేమించి వివాహం చేసుకున్న భార్య‌తో సంతోషమైన జీవితం గ‌డుపుతున్నాడు. మంచి జీతం, స‌మాజంలో గౌర‌వం కానీ దారి త‌ప్పాడు. ఈ విద్యా వంతుడు దొంగ‌గా మారాడు.. ఇంత‌కీ మంచి హోదాలో ఉన్న ఉద్యోగి దొంగ‌గా ఎందుకు మారాడ‌నేగా. ఆ విష‌యంలో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

వివ‌రాల్లోకి వెళితే.. హ‌రియాణాలోని మ‌హేంద్ర గ‌గ‌డ్‌కు చెందిన రాజేష్ అనే వ్య‌క్తి విశాఖ‌లో సెయిల‌ర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. విశాఖ కేంద్రంగా నడిచే ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే విశాఖ‌లోని శ్రీహరిపురంలో త‌న భార్య‌తో నివాసముంటుననాడు. జీవితం సంతోషంగా సాగిపోతున్న స‌మ‌యంలో రాజేష్‌.. ఆన్‌లైన్ ట్రేడింగ్‌పై మోజు పెంచుకున్నాడు. దీంతో భారీ ఎత్తున డ‌బ్బులు ట్రేడింగ్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. అయితే అందులో రాజేష్ చాలా న‌ష్ట‌పోయాడు. భారీగా అప్పుల‌పాల‌య్యాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియ‌క స‌త‌మ‌త‌మవుతోన్న స‌మ‌యంలో రాజేష్‌కు దొంగ‌త‌నం చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. ఆ ఆలోచ‌న‌కు భార్య స‌హ‌కారం కూడా అందింది. అందుకోసం నగరంలో పలుచోట్ల బైక్‌పై తిరిగారు. దీంతో.. తరచూ తాము వెళ్లే గోపాలపట్నం రైల్వే స్టేషన్‌ రోడ్డులో శ్రీ జ్యుయలరీ దుకాణంపై వారి కన్నుపడింది. కర్ఫ్యూ కారణంగా రాత్రిపూట జనసంచారం తక్కువగా ఉండడంతో దాన్నే అదనుగా చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే రాజేష్ త‌న భార్య‌తో.. బైక్‌పై గోపాలపట్నం రైల్వే స్టేషన్‌ కు చేరుకున్నాడు. అన‌తంరం రాత్రి ఒంటిగంటల సమయంలో తన వెంట తెచ్చుకున్న రాడ్‌తో షట్టర్ తాళాల‌ను ప‌గ‌ల‌గొట్టి. లోప‌ల ఉన్న బంగారం, వెండి ఆభ‌ర‌ణాల‌ను దోచుకున్నాడు. అన‌తంరం అక్కడనుంచి భార్యభర్తలిద్దరూ ఇంటికి వెళ్లిపోయారు.

హ‌రియాణాకు చెక్కేద్దాం అనుకున్నారు. కానీ..

చోరి చేసిన త‌ర్వాత త‌మ సొంతూరు హ‌రియాణాకు వెళ్దామ‌ని ఇద్ద‌రూ ప్లాన్ వేసుకున్నారు. అనుకున్న‌ట్లే ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకొన్నారు. అయితే త‌ప్పు చేసిన వారు ఎప్ప‌టికైనా చిక్కుతారు అన్న‌ట్లు ఈ జంట కూడా పోలీసుల‌కు దొరికిపోయింది. న‌గ‌ల దుకాణం య‌జ‌మాని ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు.. ప్ర‌త్యేక బృందంగా ముమ్మ‌ర ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించి విచారించారు. దీంతో స‌ద‌రు జంట మొత్తం విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టేసింది. దీంతో ప్ర‌స్తుతం రాజేష్‌, అత‌ని భార్య ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు.

Also Read: Murder Mystery: తిరుపతిలో సూట్ కేసులో శవం మిస్టరీ వీడింది.. మహిళా టెక్కీని చెప్పంది భర్తనే.. ఆపై పెద్ద డ్రామా..

Rave Party Case: రేవ్ పార్టీలో పట్టుబడిన బిగ్‌బాస్ మాజీ పోటీదారు.. భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం

Maoists Dump: మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీగా నగదు స్వాధీనం.. మావోయిస్టులకు చెందినదిగా అనుమానిస్తున్న పోలీసులు

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌