AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rave Party Case: రేవ్ పార్టీలో పట్టుబడిన బిగ్‌బాస్ మాజీ పోటీదారు.. భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం

Mumbai Rave Party Case: నాసిక్‌లోని స్కై తాజ్‌, స్కై లగూన్ అనే రెండు ఖరీధైన విల్లాల్లో రేవ్‌ పార్టీ నిర్వహించారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. పోలీసుల రైడ్‌లో 22మందిని యువతి, యువకులతను అరెస్ట్‌ చేశారు. వీరిలో...

Rave Party Case: రేవ్ పార్టీలో పట్టుబడిన బిగ్‌బాస్ మాజీ పోటీదారు.. భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం
Mumbai Rave Party Case
Sanjay Kasula
|

Updated on: Jun 28, 2021 | 1:23 PM

Share

కరోనా విలయం సృష్టిస్తున్నా… ఎంజాయ్ చేసే బ్యాచ్ మాత్రం దారికి రావడం లేదు. రేవ్ పార్టీల పేరుతో అమ్మాయిలతో చిందులేస్తూ.. డ్రగ్స్ తీసుకుంటున్న బ్యాక్ ఒకటి తాజాగా పట్టుబడింది. ఇందులో మన దక్షిణాది సినిమా. టీవీ పరిశ్రమకు చెందిన నలుగురు యువతులు ఉండటంతో ఇది పెద్ద సంచలనంగా మారింది. వీరంతా మహారాష్ట్రాలో పట్టుబడ్డారు. నాసిక్‌లోని ఇగాత్‌పురిలోని విల్లాల్లో నిర్వహిస్తున్న రేవ్‌ పార్టీపై పోలీసులు రైడ్ చేశారు. పట్టుబడినవారిలో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌తో పాటు దక్షిణాది పరిశ్రమకు చెందిన నలుగురు యువతులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు అందించిన వివరాల మేరకు… నాసిక్‌లోని స్కై తాజ్‌, స్కై లగూన్ అనే రెండు ఖరీధైన విల్లాల్లో రేవ్‌ పార్టీ నిర్వహించారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. పోలీసుల రైడ్‌లో 22మందిని యువతి, యువకులతను అరెస్ట్‌ చేశారు. అప్పటికే యువతీ యువకులంతా మద్యం మత్తులో, ఒళ్లు మరిచిన అసభ్యకరమైన స్థితిలో ఉన్నారని స్థానిక పోలీస్ అధికారులు మీడియాకు తెలిపారు.

వీరిలో 10మంది పురుషులు కాగా, 12 మంది ఆడవాళ్లు ఉన్నారు. వారి నుంచి పోలీసులు భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి పక్కనే పెద్దమొత్తంలో విదేశీ మద్యం సీసాలు, హుక్కాలు పడి ఉన్నాయని తెలిపారు.

అయితే పోలీసులు అరెస్ట్ చేసినవారిలో  బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వీరిలో మోడల్స్‌, నటులు సహా కొరియోగ్రాఫ‌ర్లుగా అని సమాచారం. నిందితులను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు వీరందరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ పార్టీ నిర్వహించడానికి సహాయపడిన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రేవ్‌ పార్టీకి వచ్చిన వాళ్లలో చాలామంది ఖరీదైన కార్లలో ఇక్కడికి చేరుకున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి: తొలకరి వచ్చింది.. వజ్రం దొరికింది.. జొన్నగిరి కూలిని లక్షాధికారిని చేసింది..

T.Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ మంటలు.. నిప్పులు చెరుగుతున్న సీనియర్ నేతలు