తొలకరి వచ్చింది.. వజ్రం దొరికింది.. జొన్నగిరి కూలిని లక్షాధికారిని చేసింది..

ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాదికారి అవ్వొచ్చనే ఆశతో నెలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరికి వజ్రాలు దొరికాయి. తాజాగా జొన్నగిరిలో ఓ కూలీకి వజ్రం దొరికింది. అక్కడ వర్షాలు...

తొలకరి వచ్చింది.. వజ్రం దొరికింది.. జొన్నగిరి కూలిని లక్షాధికారిని చేసింది..
Diamonds (1)
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 28, 2021 | 8:44 AM

ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాదికారి అవ్వొచ్చనే ఆశతో నెలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరికి వజ్రాలు దొరికాయి. తాజాగా జొన్నగిరిలో ఓ కూలీకి వజ్రం దొరికింది. అక్కడ వర్షాలు పడితే చాలు.. మట్టిలో వజ్రాలు పండుతాయి. చినుకు చినుకు పడే కొద్దీ మట్టి పొరల్లో దాగిన విలువైన వజ్రాలు బయట పడతాయి. దీంతో అక్కడి స్థానికులతో పాటు..పక్క జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ వజ్రాల వేట సాగిస్తుంటారు. తెల్లవారింది మొదలు…తిరిగి పొద్దుగూకే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వజ్రాల వేటకొనసాగిస్తారు. ఇదంతా ఎక్కడో కాదు..

తొలికరి తర్వాత వర్షాలు కురుస్తుండటంతో స్థానికులంతా వజ్రాల వేటలో బిజీ అయ్యారు. ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాదికారి అవ్వొచ్చనే ఆశతో గాలింపు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరికి వజ్రాలు దొరికాయి. తాజాగా టమాటా నారు నాటుతున్న కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళా కూలీకి ఆదివారం వజ్రం దొరికింది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ.6 లక్షలకు దాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చే వజ్రాన్వేషకులతో జొన్నగిరి పొలాలు కిటకిటలాడుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Aadhaar Link : భూ రికార్డులతో ఆధార్ అనుసంధానం.. పారదర్శకత కోసం మరో రెండిటితో లింక్..! ఏంటో తెలుసుకోండి..?

Marri Shashidhar Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ పదవి రచ్చ.. రాజీనామా చేసిన మరో సీనియర్ నేత..